తెలంగాణ ప్రభుత్వంతో Meta కీలక ఒప్పందం.. రానున్న రెండు సంవత్సరాల్లో ఎటువంటి సేవలు అందించనుంది?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా కీలక ప్రకటన చేసింది. తెలంగాణ ప్రభుత్వంతో రెండేళ్ల కాలానికి ఒప్పందం కుదిరినట్లు (Meta Joins Hands With Government of Telangana) తెలిపింది. ఈమేరకు అధికారిక ప్రకటన చేసింది. ఒప్పందంలో భాగంగా మెటా తెలంగాణ ప్రభుత్వ ఇ-గవర్నెన్స్ పోర్టల్స్, ప్రభుత్వ శాఖల ఉత్పాదకత మరియు సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను అందించనుంది. వినూత్న ఆవిష్కరణకు వీలుగా టెక్నాలజీని కూడా అందిస్తుంది.
మెటా కీలక ఒప్పందం :
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపిన మెటా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలతో ఇ-గవర్నెన్స్ మరియు పౌరసేవలను మెరుగుపరుస్తుంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ల వివరాలను మెటా వెల్లడించలేదు. ఇటీవలే మెటా Llama 3.1 AI మోడల్‌ను లాంచ్ చేసింది.

ప్రభుత్వ శాఖల్లో :
తెలంగాణ ప్రభుత్వ ఇ-గవర్నెర్స్ మెకానిజమ్, పబ్లిక్ సర్వీస్ డెలివరీ సహా ప్రభుత్వ ఏజెన్సీలు, శాఖల ఉత్పాదకత, సామర్థ్యాలను పెంచేందుకు వీలుగా జెనరేటివ్ AI ను వినియోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను ఏ స్థాయిలో వినియోగిస్తారనే సమాచారం వెల్లడించలేదు.
జనరేటివ్ AI ద్వారా :
ఈ తరహా భాగస్వామ్యాలు తమ AI విధానాల్లో భాగమని మెటా వెల్లడించింది. దీంతోపాటు సంస్థ మరిన్ని వివరాలను వెల్లడించింది. జనరేటివ్ AI ద్వారా రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అవకాశాలను పెంపొందించడంలో సాయపడాలని భావిస్తున్నట్లు పేర్కొంది. దీనిపై పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది.
తమ ఏఐ మోడళ్లు.. గోల్డమన్ సాచ్స్, AT&T వంటి సంస్థలు కూడా ఉపయోగిస్తున్నాయని మెటా పేర్కొంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లు సేవలు, డాక్యుమెంట్ రివ్యూ, కంప్యూటర్ కోడ్ జనరేషన్‌లో ఉపయోగించవచ్చని తెలిపింది. సంస్థలు. ప్రభుత్వాలతోపాటు తన సొంత సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలలోనూ వీటిని ఉపయోగిస్తోంది. త్వరలో వాట్సాప్‌లో మెటా AI వాయిస్ ఫీచర్‌ను త్వరలో లాంచ్ చేయనుందని తెలిపింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిష్కారాలు :
రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొనే అనేక సవాళ్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిష్కారాలు లభిస్తాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గ్లోబల్ హబ్‌గా నిలపడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఏఐ అభివృద్ధితో మరింత ముందుకెళ్లేందుకు వీలుగా కచ్చితమైన ప్లానింగ్‌ను రూపొందించుకుంటోంది.
ఏఐ సిటీ! :
హైదరాబాద్‌లో ఏఐ సిటీ ఏర్పాటుచేసే విధంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఐటీ హబ్‌గా ఉన్న తెలంగాణను భవిష్యత్‌తో ఏఐ ఆవిష్కరణలకు కీలక కేంద్రంగా మార్చాలని ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వ పథాకాలు, వ్యవసాయం, టెలి మెడిసిన్, విపత్తుల నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకోనుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








