మలేషియన్లు సోషల్ మీడియాకు బానిసలయ్యారా..?

Posted By: Super

మలేషియన్లు సోషల్ మీడియాకు బానిసలయ్యారా..?

ప్రపంచంలో ఏ దేశ జనాభా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్(ట్విట్టర్, ఫేస్‌బుక్)లకు బానిస అయ్యారు అని ఇటీవల కామ్ స్కోర్ సంస్ద నిర్వహించిన సర్వేలో మలేషియన్లు అని తేలింది. కామ్ స్కోర్ వెల్లడించిన సమాచారం ప్రకారం మలేషియన్లు రోజులో ముప్పావు వంతు సమయంలో సోషల్ మీడియా మీదనే గడుపుతున్నారని సమాచారం. ఆగస్టునెలలో ఇది ఎక్కవగా పెరిగిపోయిందని తెలిపింది. ఇక వివరాల్లోకి వెళితే మలేషియాలో మొన్నిటి వరకు గూగుల్ రోజు వారి సందర్శకుల తాడికిలో మొదటి స్దానంలో ఉండేది.

ఐతే మలేషియాలో ఫేస్‌బుక్ తన కార్యకలాపాలను ప్రారంభించిన తర్వాత ఆగస్టు నెల నుండి అక్కడున్న జనాభా ఫేస్‌బుక్‌కి బానిసలై 9.9 మిలియన్ సందర్శకులు ప్రతిరోజు సందర్శించడం వల్ల ఫేస్‌‍బుక్ గూగుల్‌ని అధిగమించి మలేషియా దేశంలో ఎక్కవ మంది యూజర్స్ దర్శించే వెబ్ సైట్‌లో మొదటి స్ధానంలో నిలిచింది.

మలేషియాలో ఉన్న టాప్ పది వెబ్ సైట్స్‌లను గనుక చూసినట్లేతే యాహు, మైక్రోసాప్ట్, వికీమీడియా(వికీపీడియా అనుబంధ సంస్ద), బ్లాగింగ్ వెబ్ సైట్ వర్డ్ ప్రెస్, మలేషియా లోకల్ సెల్లింగ్ సైట్ ముధ్.మై వెబ్ సైట్స్ కేవలం 2.5 మిలియన్ సందర్శకులతో తర్వాత స్దానాలలో నిలిచాయి. సోషల్ మీడియా వెబ్ సైట్స్‌లతో పోల్చితే వెబ్ ట్రాఫిక్ ఎక్కువగా ఎంటర్టెన్మెంట్ వెబ్ కంటెంట్(11.5%), పోర్టల్స్(11%), పాపులర్ ఇంటర్నెట్ డెస్టినేషన్స్ ఇనిస్టాంట్ మెసెంజర్(5.3%), వెబ్ ఆధారిత ఈమెయిల్(4.2%)ల ద్వారా వస్తుంది.

కామ్ స్కోర్ సంస్ద ఈ డేటాని ఇప్పటి వరకు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. గూగుల్ వీడియో షేరింగ్ వెబ్ సైట్ అయిన యూట్యూబ్‌కు కూడా ఫేస్ బుక్ తెలియకుండా దెబ్బ కొడుతుంది. ఏవిధంగా అని అనుకుంటున్నారా.. ఫేస్‌బుక్‌లో ఉన్న యూజర్స్ పొస్ట్ చేసిన వీడియోలను యూజర్స్ అమితంగా చూడడమే. ఇలా యూట్యూబ్‌ వీడియో(9మిలియన్)తో పోల్చితే ఫేస్‌బుక్ వీడియో శాతం(4.1మిలియన్)లతో రెండవ స్దానంలో ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot