ప్రధాన కార్యాలయం 'ఫ్లోరిడా' నుండి 'జకార్తా' కి..?

By Super
|
Social shopping site Multiply to relocate its global headquarters to Indonesia


సోషల్ షాపింగ్ సైట్ 'మల్టీప్లే' తన ప్రధాన కార్యాలయాన్ని ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉన్న బోకా రాటన్ నుండి ఇండోనేషియాలో జకార్తాకి తరలించనున్నట్లు డైలీ సోషల్ కధనంగా ప్రచురించింది. అంతర్జాతీయ మార్కెట్లో సంయుక్తంగా అభివృద్ధి చెందుతున్న విఫణి ఎంచుకోవడం ఒక సంస్థ యొక్క ఒక అరుదైన ఉదాహరణ, కానీ దగ్గరగా వినియోగదారుల మెజారిటీ కంపెనీ బాగు చేస్తుందన్న భావన ఉందన్నారు.

కంపెనీ ప్రధాన కార్యలయాన్ని మార్చడం‌పై 'మల్టీప్లే' సీఈవో 'పీటర్ పెజారిస్' మాట్లాడుతూ ఆగ్నేయాసియా దేశాలైన ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, ఫిలిఫ్పేన్స్, ధాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాలలో సుమారు 100,000 వ్యాపారస్తులు భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం జకార్తాలో ఉన్న 'మల్టీప్లే' ఆఫీసులో 50 నుండి 126 వరకు ఉద్యోగులు ఉన్నారని అన్నారు. కానీ ఫిలిప్పెన్స్, ఇండోనేషియాలు 'మల్టీప్లే' కు పెద్ద మార్కెట్లుగా అభివర్ణించా రు.

గతయేడాది 'మల్టీప్లే' వెల్లడించిన వివరాల ప్రకారం ఇండోనేషియాలో ఉన్న 34,000 సెల్లర్స్‌లను నెలకు 7 మిలియన్ల సందర్శకులు సందర్శించారని అన్నారు. ఐతే ఈ సంవత్సరం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉందని అన్నారు. ఈ నెల నుండి ఇండోనేషియాలో నెలకు 2000 కొత్త సెల్లర్స్‌ని నెలకొల్పాలనే యోచనలో 'మల్టీప్లే' ఉంది. ఇండోనేషియాకు 'మల్టీప్లే' కంపెనీ వస్తున్న సందర్బంలో మార్చి వరకు ఆ కంపెనీకి ఇండోనేషియా గవర్నమెంట్ షిప్పింగ్ ఖరీదు, సుంఖాలు తగ్గించనున్నట్లు తెలిపింది. రాబోయే 12 నెలలో 'మల్టీప్లే' గ్లోబల్ ఆఫీసు పూర్తి కార్యకలాపాలను మొదలు పెట్టనుందని తెలిపారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X