బాగుందనుకునేలోపే ‘బ్యాడ్ న్యూస్’!

మెగా బ్రాండ్ సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి ఇటీవల విడుదలచేసిన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ‘ఎస్ 3’కి ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. అంతా బాగుందనుకుంటున్న నేపధ్యంలో.. పలువురు గెలాక్సీ ఎస్ 3 (అంతర్జాతీయ వర్షన్) వినియోగదారులు బ్యాటరీ ఫేలవమైన పనితీరును ప్రదర్శిస్తుందంటూ ఫిర్యాదులు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ అంశం పై స్పందించిన XDA డెవలపర్ల బృందం సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన లోపం కారణంగా బ్యాటరీ బ్యాకప్ త్వరగా ఆవిరై పోతుందని నిర్థారించినట్లు తెలిసింది. ఈ సాంకేతిక లోపాన్ని త్వరలోనే అధికారిక అప్‌డేట్ ద్వారా సామ్‌సంగ్ అధిగమించనుంది.
గెలాక్సీ ఎస్3 ఫీచర్లు:
4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు. పెబల్ బ్లూ, మార్బుల్ వైట్ రంగుల్లో లభించే గెలాక్సీ ఎస్-3 ఫోన్ ధర రూ.43,180.


Click it and Unblock the Notifications