ఇంగ్లీషు నుండి 26 భాషల్లోకి ట్రాన్సలేట్..!

Posted By: Staff

ఇంగ్లీషు నుండి 26 భాషల్లోకి ట్రాన్సలేట్..!

 

లండన్: సాప్ట్‌వేర్ తయారీ దిగ్గజం మైక్రోసాప్ట్ తన ఉనికిని చాటుకునేందుకు ఎప్పుటికప్పుడు మార్కెట్లోకి కొత్త సాప్ట్‌వేర్‌లను విడుదల చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా 'యూనివర్సిల్ ట్రాన్సలేటర్' అనే కొత్త సాప్ట్ వేర్‌ని విడుదల చేసింది. ఈ 'యూనివర్సిల్ ట్రాన్సలేటర్' ని ఉపయోగించి వినియోగదారులు ఇంగ్లీషు భాషను 26 భాషలలోకి ట్రాన్సలేట్ చేయవచ్చు.

వాషింగ్టన్‌లోని రెడ్‌మాండ్ ఉన్న మైక్రోసాప్ట్ ప్రాంతీయ కార్యాలయం ప్రతినిధులు ఫ్రాంక్ సూగ్న్, రిక్ రషీద్‌లు అందించిన సమాచారం ప్రకారం ఈ 'యూనివర్సిల్ ట్రాన్సలేటర్' సహాయంతో యూజర్స్ సొంత వాయిస్‌తో కూడా మాట్లాడొచ్చని ప్రముఖ పత్రిక డైలీ మెయిలీ తెలిపింది. అంతేకాదండోయ్ ఈ సాప్ట్‌వేర్ సహాయంతో దేశ విదేశాలలో ఉన్న సందర్శకులతో ఒకే భాష మాట్లాడుకపోయినప్పటికీ వారితో మీరు ఒకరోజు సంభాషణలను నెరపవచ్చు.

ఫ్రాంక్ సూగ్న్ చెప్పిన దాని ప్రకారం లాంగ్వేజి స్టూడెంట్స్ ఈ సాప్ట్‌వేర్‌ని ఉపయోగించుకోని నావిగేషనల్ డివైజెస్‌తో పనిచేయవచ్చు అన్నారు. టూరిస్టులు ఎవరైనా విదేశాల విజిట్‌కు వెళ్లినప్పుడు ఈ సాప్ట్‌వేర్‌ని మీ స్మార్ట్ ఫోన్స్‌లో ఇనిస్టాల్ చేసుకోని ఈజీగా వారికి కావాల్సిన భాషలో ట్రాన్సలేట్ చేసుకోవచ్చు. వీటితో పాటు మేము కొన్ని అప్లికేషన్లుని రూపొందిస్తున్నాం. మీకు కావాల్సిన భాషలో ట్రాన్సలేట్ చేసిన తర్వాత స్వరాన్ని గుర్తు పట్టి పైనల్ టెక్స్ట్ మీకు అర్దమయ్యే భాషలో వస్తుంది. ఈ సాప్ట్‌వేర్‌ని ఆసియాలోనే రెండవ అతి పెద్ద రీసెర్చ్ ల్యాబ్ బీజింగ్‌లో ఉన్న 'మైక్రోసాప్ట్ రీసెర్చ్ ల్యాబ్' లో దీనిని కనిపెట్టడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot