వరకట్నంకేసులో ఉరేసుకోని చనిపోయిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ భార్య

Posted By: Staff

వరకట్నంకేసులో ఉరేసుకోని చనిపోయిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ భార్య

బెంగళూరు: పెళ్శి జరిగి కనీసం మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే తన భార్యను వరకట్నం కోసం వేధించసాగాడు ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి. భర్త చేస్తున్నటువంటి వరకట్న వేధింపులుకు భరించలేక ఆ భార్య పాపం ఉరివేసుకన్న సంఘటన బెంగుళూరులో జరిగింది. ఈ విషయంపై పోలీసులు ఆ సాప్ట్‌వేర్ ఉద్యోగిని పోలీసులు సోమవారం అరెస్టు చేయడం జరిగింది. అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురుని వరకట్న వేధింపులకు గురిచేస్తున్నాడని కేసు పెట్టడంతో ఆ సాప్ట్‌వేర్ ఉద్యోగిని వరకట్న కేసు క్రింద అరెస్టు చేయడం జరిగింది.

ఇక పోలీసుల కధనం ప్రకారం అమ్మాయి తల్లిదండ్రులు బీహార్ వాస్తవ్యులు. విషయం తెలసినటువంటి బీహార్ నుండి వచ్చి తన కూతురుని అల్లుడు చాలా రోజులు నుండి వరకట్న వేధింపులకు గురిచేస్తున్నాడని, ఈ విషయం అమ్మాయి మాతో చెప్పిందని వారు వెల్లడించారన్నారు. ఇది ఒక కారణం కాగా సాప్ట్‌వేర్ ఉద్యోగి అయినటువంటి అతనికి మరో అమ్మాయితో అక్రమ సంబంధం కూడా ఉందని పోలీసులు వెల్లడించారు. సాప్ట్‌వేర్ ఉద్యోగి భార్య చనిపోవడానికి ఇది కూడా మరో ముఖ్య కారణం కావచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot