సాప్ట్‌వేర్ అమ్మకం దారుల కొసం 'సాప్ట్‌వేర్ ఆన్ వీల్స్'

Posted By: Staff

సాప్ట్‌వేర్ అమ్మకం దారుల కొసం 'సాప్ట్‌వేర్ ఆన్ వీల్స్'

బెంగళూరు: రోజులు మారే కొద్ది, ఇండియన్ సాప్ట్‌వేర్ మార్కెట్ కూడా కొత్త పుంతలు తొక్కుతుందని అంటున్నారు సాప్ట్‌వేర్ అమ్మకం దారులు. ప్రస్తుతం సాప్ట్‌వేర్ మార్కెట్లో ఉన్న పరిస్దితులకు అనుగుణంగా వారియొక్క తెలివితేటలను ప్రదర్శిస్తూ ముందు సాగిపోవాలని అంటున్నారు. జాతీయ సాప్ట్‌వేర్ మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని సత్తా చాటుతూ తక్కువ ధరలో మార్కెట్లో వారి స్దానాన్ని సుస్దిరం చేసుకొవాలని సాప్ట్‌వేర్ అమ్మకం దారులు భావిస్తున్నారు.

ఇందులో భాగంగానే 'సాప్ట్‌వేర్ ఆన్ వీల్స్' అనే సంస్ద కొత్త ఆలోచనలతో సాప్ట్‌వేర్ అమ్మకం దారులకు మార్కెట్లో వారియొక్క ఉత్పత్తులను ప్రజలకు ఎలా చేరవేయాలో దానికి సంబంధించిన విధి విధాలను ఎటువంటి కంపెనీలకైనా అతి తక్కువ ధరలో అందివ్వడం జరుగుతుంది. దేశంలో బెంగుళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి మహానగరాలలోని వేరు వేరు ప్రాంతాలలో 'సాప్ట్‌వేర్ ఆన్ వీల్స్' రోడ్డు షోలు నిర్వహించడంతో పాటు, ఐటి రంగం, ఐటియేతర రంగానికి చెందిన సంస్దలు డెవలప్ చేసిన ప్రతి సాప్ట్‌వేర్‌కి ఓపెన్ మార్కెట్ ఉండేలా చూస్తుంది.

ఇటువంటి కార్యక్రమాలు సాధారణంగా అనుకున్నప్పుడు మాత్రమే చేయడం జరుగుతుంది. ఇందులో పాల్గోనడానికి చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. మరి మీరు డెవలప్ చేసిన సాప్ట్‌వేర్‌ని అమ్మదలిస్తే వెంటనే మీ కంపెనీని ఎంట్రీలో పొందుపరుచుకొండి.

రాబోయే కార్యక్రమాలు:

హైదరాబాద్, చెన్నైనగరాలకు సంబంధించి కార్యక్రమాలను ప్రకటించడం జరిగింది. హైదరాబాద్ నగరానికి చెందిన రిజస్ట్రేషన్ అంతా పూర్తి అయింది. ఇదే సమయంలో చెన్నైలో జరిగే కార్యక్రమానికి రిజస్టేషన్ ఓపెన్ అవుతుంది.

చెన్నై నగరానికి చెందిన సాప్ట్‌వేర్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం జనవరి 2012లో జరుగుతుంది. చెన్నైలో ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ముంబై మాహానగరంలో మొదలవుతుంది. వేరు వేరు నగరాలను బట్టి ఆయా కంపెనీల రిజస్టేషన్ ఉంటుంది.

పూర్తి సమాచారం కొసం సాప్ట్‌వేర్ ఆన్ వీల్స్ వెబ్‌సైట్ www.sow.ipott.comని సందర్శించండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot