ఈ సాప్ట్‌వేర్‌తో 2జిబి కార్డులో 50 సినిమాలు..

Posted By: Super

 ఈ సాప్ట్‌వేర్‌తో 2జిబి కార్డులో 50 సినిమాలు..

 

ఫీచర్ ఫోన్ల కోసం చిప్‌లను తయారుచేసే మీడియా టెక్ కంపెనీ ఇప్పుడు ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌ని విడుదల చేసింది. ఈ సాప్ట్‌వేర్ సహాయంతో సినిమా వీడియో క్వాలిటీకి ఎటువంటి డామేజి కాకుండా పూర్తి నిడివి గల సినిమాని 150 MB వరకు  పరిమాణం తగ్గించవచ్చు. ఈ టెక్నాలజీ పేరు మొబైల్ ధియేటర్. ఈ సాప్ట్‌వేర్ MediaTek MT6252c ఫ్లాట్ ఫామ్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

ఈ సాప్ట్‌వేర్‌ని ఇండియన్ హ్యాండ్ సెట్ తయారీదారులైన స్పైస్, ఇంటెక్స్, మైక్రోమ్యాక్స్ మొబైల్ వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. ఈ సాప్ట్ వేర్‌ని అతి త్వరలో ఈ మొబైల్స్‌లలో నిక్షిప్తం చేయనున్నట్లు సమాచారం. మొబైల్ ధియేటర్ సాప్ట్ వేర్ MediaTek MT6255 మరియు MT6256 ఫ్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. దీనితో పాటు స్పైస్, లావా, కార్బన్, మైక్రోమ్యాక్స్, మ్యాక్స్, ఓనిడా, వీడియోకాన్, లెమన్ లాంటి మొబైల్స్‌లో కంప్రషన్ సాప్ట్‌వేర్‌ని నిక్షిప్తం చేయనున్నారు.

ఈ కంప్రషన్ సాప్ట్‌వేర్‌ని నిక్షిప్తం చేయడం వల్ల ఆడియోలు, వీడియోలు తీసుకునే ఎక్కువ మెమరీని దీని ద్వారా తగ్గించవచ్చు. పరిమాణం తగ్గించిన వీడియోలు ఎటువంటి డామేజి లేకుండా ప్లే చేసేందుకు ఇది సహాయ పడుతుంది. ఈ కంప్రషన్ సాప్ట్‌వేర్‌ H.264, MPEG 4తో పాటు పాపులర్ ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్టు చేస్తుంది.  పరిమాణం తగ్గించిన వీడియోలను మీ మొబైల్‌లో ప్లే చేయడంతో పాటు స్నేహితులకు షేర్ చేయవచ్చు.

Read In English:

3డి కంటెంట్‌ని కూడా ఈ సాప్ట్‌వేర్  సపోర్టు చేస్తుంది. మార్కెట్లో రూ 15లకు లభించే బ్లూ రెడ్ 3డి గ్లాసులను ఉపయోగించి వీడియోలను వీక్షించవచ్చు.  ఎటువంటి అదనపు ఖరీదు లేకుండా మీడియా టెక్ మొబైల్ ధియేటర్ అధునాతన ప్రత్యేకతలను అందిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot