అతివేగంతో భూమిని తాకనున్న సౌర తుఫాను!! మొబైల్, GPS సిగ్నల్లకు సమస్యలు
సౌరవ్యవస్థలో అనేక గ్రహాలు ఉన్నపటికీ మానవులకు నివాసయోగంగా ఉన్నది భూమి మాత్రమే అని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే భూమి తరచుగా ఎదో ఒక ప్రమాదాన్ని ఎదురుకుంటున్న విషయం కూడా అందరికి తెలిసినదే. అయితే ఇప్పుడు కొత్తగా ప్రమాదం శక్తివంతమైన సౌర తుఫాను రూపంలో రాబోతున్నది. ఇది 1.6 మిలియన్ కిలోమీటర్ల అతివేగంతో భూమిని వచ్చే ఆదివారం లేదా సోమవారం తాకనున్నట్లు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి.

ఈ సౌర తుఫాను అగ్నిల బగబగ మండే సూర్యుడి యొక్క వాతావరణం నుండి ఉద్భవించిందని స్పేస్వెదర్.కామ్ నివేదిక పేర్కొంది. ఈ సౌర తుఫాను భూమి యొక్క అయస్కాంత క్షేత్రం మీద ఆధిపత్యం వహించనున్నది. దీనితో పాటుగా అంతరిక్ష ప్రాంతంపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

సోలార్ విండ్
"సౌర తుఫాను ప్రభావంతో ఈ రోజు తరువాత భూమి మీద గాలి అధిక వేగంతో ప్రయాణించే అవకాశం ఉంది. ఈ అతి వేగ ప్రవాహం అనేది భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని తాకుతుందని భావిస్తున్నారు. ఈ తుఫాన్ అనేది సూర్యుడి వాతావరణంలో భూమధ్యరేఖ రంధ్రం నుండి ప్రవహించడం కారణంగా గాలి వేగం సెకనుకు 500 కి.మీ వరకు ఉండదనున్నది. పూర్తి స్థాయి భూ అయస్కాంత తుఫానులు అనేవి అసంభవం కానీ తక్కువ భూ అయస్కాంత మరియు అధిక అక్షాంశ అరోరాస్‌కు దారితీస్తుంది "అని వెబ్‌సైట్‌లోని పోస్ట్ చూపుతున్నది. సౌర తుఫాను కారణంగా ఉత్తర లేదా దక్షిణ ధ్రువంలో నివసించే ప్రజలకు మనోహరమైన ఖగోళ లైటింగ్ యొక్క దృశ్యం కనిపించే అవకాశం ఉంటుంది.

సౌర తుఫానుల కారణంగా భూమి యొక్క బయటి వాతావరణం అధికంగా వేడిఅయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా దీని యొక్క ప్రభావం ఉపగ్రహాలపై కూడా చూపే అవకాశం ఉంది అని స్పేస్‌వెదర్.కామ్ తెలిపింది. ఇది GPS నావిగేషన్, మొబైల్ ఫోన్ సిగ్నల్ మరియు ఉపగ్రహ టీవీలకు కూడా అంతరాయం కలిగించే అవకాశం ఉంది. అలాగే విద్యుత్ లైన్లలో కరెంట్ ఎక్కువగా ఉంటుంది కావున ట్రాన్స్ఫార్మర్లు కూడా అధికంగా నష్టాలను కలిగించే అవకాశం ఉంది. యుఎస్ అంతరిక్ష సంస్థ నాసా ప్రకారం సౌర తుఫాను వేగం గంటకు 1.6 మిలియన్ కిలోమీటర్లకు మించి ఉండవచ్చు.


Click it and Unblock the Notifications








