మగవారిని స్టైలిష్‌గా తీర్చిదిద్దే సొనాటా టచ్‌స్ర్కీన్ వాచ్‌లు!

Posted By: Prashanth

బెంగళూరు: ప్రముఖ వాచ్ తయారీ కంపెనీ సొనాటా దేశీయంగా మొట్టమొదటి టచ్‌స్ర్కీన్ వాచ్‌లను రూపొందించింది. వీటీని గురువారం బెంగుళూరులో నిర్విహించిన ప్రత్యేక కార్యక్రమంలో టైటాన్ ఇండస్ట్రీస్ ఎండీ భాస్కర్ భట్ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉండే వాచ్‌ల విభాగంలో టచ్‌స్ర్కీన్ వాచ్‌లను తయారు చేసిన ఘనత తమకే దక్కుతుందని భట్ వెల్లడించారు.

ఈ వాచ్‌లను ఎక్కువ మన్నిక కోసం ‘ఆక్రిలోనిట్రిలే బుటాడైన్ స్టైరైన్’, ‘పోల్యూరెథానే’ అనే రెండు రకాల మెటీరియల్స్‌తో తయారు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ టచ్‌స్క్రీన్ వాచ్‌లలో లైట్, స్టాప్‌వాచ్, మల్టిపుల్ టైమ్ డిస్‌ప్లే, హై వాటర్ రెసిస్టెంట్ తదితర ఫీచర్స్‌ను పొందుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు. వీటికి సొనాటా నుంచి ఒక ఏడాది వారంటీ కూడా లభిస్తుందని చెప్పారు. వీటి ప్రారంభ ధర రూ. 1,499గా నిర్ణయించామన్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot