సోనీ నుంచి 75 ఇంచ్ ఆండ్రాయిడ్ టీవీ, ధర చూస్తే బేజారే!

ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు సోనీ సంస్థ అద్భుతమైన మరో ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది. సోనీ కేడీ-75ఎక్స్‌9500జి పేరిట ఓ నూత‌న 4కె అల్ట్రాహెచ్‌డీ టీవీని భార‌త మార్కెట్‌లో విడుద‌ల

|

ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు సోనీ సంస్థ అద్భుతమైన మరో ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది. సోనీ కేడీ-75ఎక్స్‌9500జి పేరిట ఓ నూత‌న 4కె అల్ట్రాహెచ్‌డీ టీవీని భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. 75 అంగుళాల స్క్రీన్‌తో సోనీ 4కే అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీని ''కేడీ75 ఎక్స్‌9500జీ’’ పేరుతో భారత మార్కెట్లో అవిష్కరించింది. దీని ధరను రూ. 4,49,990 గా నిర్ణయించింది.

సోనీ నుంచి 75 ఇంచ్ ఆండ్రాయిడ్ టీవీ, ధర చూస్తే బేజారే!

దేశవ్యాప్తంగా సోనీ సెంటర్‌, ఇతర ఎలక్ట్రానిక్స్‌ స్టోర్ల ద్వారా ఈ సూపర్‌ టీవీలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. మామూలు ఎల్‌ఈడీ టీవీల కంటే ఆరు రెట్లు ఎక్కువ క్వాలిటీ పిక్చర్‌ అందిస్తుందని కంపెనీ చెప్పింది.

ప్రధాన ఫీచర్లు

ప్రధాన ఫీచర్లు

75 అంగుళాల స్ర్కీన్‌, బెజెల్‌ లెస్‌ డిస్‌ప్లే ఈ టీవీకీ ప్రధాన ఆకర్షణ. ఇంకా 3840x2160 పీక్సెల్స్‌ రిజల్యూషన్‌, గూగుల్‌ అసిస్టెంట్‌ సపోర్ట్‌, ఎక్స్‌1 అల్టిమేట్‌ పిక్చర్‌ ప్రాసెసర్‌, ఫుల్‌ అర్రే లోకల్‌ డిమ్మింగ్‌ బ్యాక్‌లైట్‌, అల్ట్రా వైడ్‌ వ్యూయింగ్‌ యాంగిల్‌, నెట్‌ఫ్లిక్స్‌ కాలిబ్రేటెడ్‌ మోడ్‌, ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.

16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌

16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌

ఈ టీవీ ఆండ్రాయిడ్ 8.0 ఓఎస్ ఆధారంగా ప‌నిచేస్తుంది. ఇందులో 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, బ్లూటూత్‌, గూగుల్ అసిస్టెంట్ స‌పోర్ట్‌, డాల్బీ విజ‌న్ వంటి ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు

ఎంఐ టీవీ 4ఎస్‌

ఎంఐ టీవీ 4ఎస్‌

ఇదిలా ఉంటే చైనా దిగ్గజం షియోమి ఇప్పటికే ఎంఐ టీవీ 4ఎస్‌ పేరిట 75 ఇంచుల డిస్‌ప్లే సైజ్ గల సరికొత్త 4కె ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని చైనా మార్కెట్‌లో విడుదల చేసింది.రూ.82,100 ధరకు ఈ టీవీ వినియోగదారులకు లభిస్తున్నది.త్వరలో భారత్‌లోనూ ఈ టీవీ విడుదల కానుంది.

ఎంఐ టీవీ 4ఎస్‌ ఫీచర్లు...

75 ఇంచుల డిస్‌ప్లే సైజ్ (4K HDR)

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం

క్వాడ్‌కోర్ ప్రాసెసర్

2 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

డ్యుయల్ బ్యాండ్ వైఫై 802.11, బ్లూటూత్ 4.2

3 హెచ్‌డీఎంఐ, 1 ఏవీ, 2 యూఎస్‌బీ, 1 ఈథర్‌నెట్ పోర్టు,

హెచ్‌డీఆర్ సపోర్ట్, డాల్బీ ఆడియో డీటీఎస్

 

వియు 100 అంగుళాల 4కే ఎల్‌ఈడీ టీవీ

వియు 100 అంగుళాల 4కే ఎల్‌ఈడీ టీవీ

లగ్జరీ టెలివిజన్ బ్రాండ్ వియు ప్రపంచంలోనే ఎవ్వరూ తీసుకురాలేని విధంగా తొలి 100 అంగుళాల 4కే ఎల్‌ఈడీ టీవీ భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీయూ 100 పేరుతో ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ టీవీని కంపెనీ అత్యంత ఖరీదైన స్మార్ట్‌ టీవీగా కంపెనీ తెలిపింది. కంపెనీ దీని ధరను రూ.20 లక్షలుగా నిర్ణయించింది.

224 ఐఫోన్ల సైజు..

224 ఐఫోన్ల సైజు..

ఈ కొత్త టీవీ 100 అంగుళాల ప్యానల్‌, 224 ఐఫోన్ల సైజుతో సమానమని కంపెనీ అభివర్ణించింది. వీయూ సుపీరియర్‌ ప్యానల్‌ టెక్నాలజీతో ఇది రూపొందింది.4కే ఆల్ట్రా హెచ్‌డీఆర్‌ డిస్‌ప్లేను ఇది కలిగి ఉండటంతో ప్రీమియం వ్యూయింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను టెలివిజన్‌ వీక్షకులు పొందవచ్చు. 2.5 బిలియన్‌ కలర్స్‌ను ఇది రీప్రొడ్యూస్‌ చేస్తుంది. ఈ టీవీ ద్వారా ఏ+ గ్రేడ్‌ ప్యానల్‌ను కంపెనీ అందిస్తోంది.

5 డాల్బే-సర్టిఫైడ్‌ స్పీకర్స్‌..

5 డాల్బే-సర్టిఫైడ్‌ స్పీకర్స్‌..

5 డాల్బే-సర్టిఫైడ్‌ స్పీకర్స్‌తో ఈ పెద్ద టీవీని వీయూ తీసుకొచ్చింది. ఇది ప్రతి స్వరం కూడా స్పష్టంగా వినిపించేలా.. 2000 వాట్‌ స్పీకర్స్‌ను అందిస్తుంది.ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో స్మార్ట్‌ ఓఎస్‌తో ఇది పనిచేస్తుంది. క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉన్న ఈ టీవీ, 16జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను, 2.5జీబీ ర్యామ్‌తో రూపొందింది.

మొబైల్స్‌కు, ల్యాప్‌టాప్స్‌కు కనెక్ట్‌

మొబైల్స్‌కు, ల్యాప్‌టాప్స్‌కు కనెక్ట్‌

గూగుల్‌ ప్లే స్టోర్‌ ఇంటిగ్రేషన్‌, క్రోమోకాస్ట్‌ సపోర్ట్‌ ఈ డివైజ్‌లో ఉన్నాయి. వీయూ 100ను మొబైల్స్‌కు, ల్యాప్‌టాప్స్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు. వాయిస్‌ కమాండ్‌లతో లైటింగ్‌ను, ఎయిర్‌ కండీషనింగ్‌ను కూడా ఇది కంట్రోల్‌ చేస్తుంది.మూడు హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, 2 యూఎస్‌బీ పోర్ట్‌లు, హెచ్‌డీఎంఐ ఏఆర్‌సీ/సీఈబీ, బ్లూటూత్‌, వైఫై, ఏవీ ఇన్‌పుట్‌, ఆర్‌ఎఫ్‌ రేడియో ఫ్రీక్వెన్సీ ఇన్‌పుట్‌ వంటి కనెక్టివిటీ ఆప్షన్లను ఇది కలిగి ఉంది.
యూట్యూబ్‌, హాట్‌స్టార్‌, హంగామా వంటి ప్రీ-ఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌తో ఇది వచ్చింది.దీని బరువు 104కేజీలు. వీయూ స్టోర్‌కి వెళ్లి, దీన్ని బుక్‌ చేసుకోవచ్చు. ఏడాది వారెంటీతో ఇది లభ్యమవుతుంది. వీయూ అధికారిక స్టోర్లలో దీన్ని ప్రస్తుతం కంపెనీ అందిస్తుంది.పార్టనర్ల స్టోర్ల వద్ద కూడా దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది

 

 

 

Best Mobiles in India

English summary
Sony 75-Inch 4K HDR LED Android TV in X9500G Series Launched in India at Rs. 4,49,990

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X