Sony కొత్త టీవీలు ఇండియా లో లాంచ్ అయ్యాయి ! ధర మరియు ఫీచర్లు చూడండి.

By Maheswara
|

భారతదేశంలోని వినియోగదారుల కోసం సోనీ తన సరికొత్త బ్రావియా సిరీస్‌ను ప్రారంభించింది. కొత్త Sony Bravia X75K స్మార్ట్ టీవీని ఇప్పడు ఇండియాలో లాంచ్ చేసింది.ఇది Android TV ప్లాట్‌ఫారమ్‌తో వస్తుంది.అంటే మీకు అంతర్నిర్మిత Chromecast మద్దతు లభిస్తుంది. కంపెనీ కొత్త బ్రావియా టీవీలను 43-అంగుళాల, 50-అంగుళాల, 55-అంగుళాల మరియు 65-అంగుళాల నాలుగు వేర్వేరు స్క్రీన్ సైజులలో తీసుకువచ్చింది.

43-అంగుళాల మోడల్

ఈ నాలుగింటిలో, సోనీ భారతదేశంలోని కొనుగోలుదారుల కోసం 43-అంగుళాల మరియు 50-అంగుళాల మోడళ్లను అందిస్తోంది.ఈ కొత్త సోనీ బ్రావియా టీవీలు డాల్బీ ఆడియో సపోర్ట్‌ను పొందుతాయి మరియు ఇమేజింగ్ నాణ్యత కోసం సోనీ యొక్క X1 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతాయి. Sony Bravia X75K 4K TV సిరీస్ ఇండియా ధరలు రూ. 55,990 నుండి ప్రారంభమవుతాయి. దీని ద్వారా మీకు 43-అంగుళాల మోడల్ లభిస్తుంది. 50 అంగుళాల మోడల్‌ను కొనుగోలు చేసే వారు రూ.66,990 చెల్లించాలి. దేశంలోని ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా సోనీ ఈ టీవీలను విక్రయిస్తోంది.

Sony Bravia X75K 4K టీవీ స్పెసిఫికేషన్‌లు
 

Sony Bravia X75K 4K టీవీ స్పెసిఫికేషన్‌లు

కొత్త Sony Bravia 4K TV UHD రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది మరియు Sony X1 ప్రాసెసర్ సహాయంతో డిస్‌ప్లే మరింత శక్తి ని పొందుతుంది. సోనీ తన లైవ్ కలర్ టెక్నాలజీతో స్క్రీన్ కలర్ అవుట్‌పుట్‌కి అదనపు ఫోకస్ ఇచ్చింది. పూర్తి HD మరియు 2K కంటెంట్‌ను 4K నాణ్యతకు అప్ గ్రేడ్ చేయడానికి ఇది సహాయ పడుతుంది. సోనీ టీవీలను X-రియాలిటీ ప్రో టెక్‌తో అమర్చింది మరియు మోషన్‌ఫ్లో XR అదనపు ఫ్రేమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా స్క్రీన్ పైన వివరాలు వీక్షకుడికి మరింత నాణ్యతతో కనిపిస్తాయి. ఈ టీవీ సిరీస్‌కి డిజైన్ మరో బలమైన అంశం. స్క్రీన్‌పై ఉండే కనిష్ట బెజెల్‌లు ఈ ధర పరిధిలో టీవీ నుండి ఆశించే ప్రీమియం అనుభవాన్ని జోడిస్తాయి.

Android TV ప్లాట్‌ఫారమ్‌

Android TV ప్లాట్‌ఫారమ్‌

మరికొన్ని వివరాలు గమనిస్తే, ఈ టీవీ సిరీస్ లోని Sony యొక్క 4K టీవీలను చాలా బ్రాండ్‌ల కంటే మెరుగ్గా మరియు ఫీచర్-ప్యాక్‌గా చేస్తాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,ఈ సిరీస్ కు Sony Android TV ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకుంది. ఇది మీకు Google Chromecast ని మరియు Google Play Store ద్వారా యాప్‌లకు యాక్సెస్‌ని అందిస్తుంది. మీరు Apple AirPlay 2 మరియు HomeKitతో కూడా ఈ టీవీలను ఉపయోగించవచ్చని సోనీ తెలిపింది. Sony Bravia X75K 20W స్పీకర్ యూనిట్‌ను పొందుతుంది. ఇది గేమింగ్, సినిమాలు మరియు మరిన్నింటి కోసం మెరుగైన సౌండ్ క్వాలిటీ కోసం డాల్బీ ఆడియోకు మద్దతు ఇస్తుంది.

Best Mobiles in India

English summary
Sony Bravia X75K 4K LED TV Series Launched In India Priced At Rs.55990. Features Details Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X