ఊహించని ధరతో బ్రావియా oled టీవీలు వస్తున్నాయి!

Posted By: Madhavi Lagishetty

జపనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ భారతీయ వినియోగదారుల కోసం కొత్తగా oled టీవీలను ఆవిష్కరించింది. కొత్త సాంకేతిక టెక్నాలజీతో రూపొందించిన బ్రావియా oled టీవీని 3,64,900రూపాయలకు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంచనుంది.

ఊహించని ధరతో బ్రావియా oled టీవీలు వస్తున్నాయి!

ఈ టీవీ మరో హైఎండ్ మోడల్ టెలివిజన్ ను తలపిస్తుంది. కానీ ఇది ఆ కోవకు చెందిన టెలివిజన్ కాదు. 4కె టీవీలో స్పెషల్ ఫీచర్ ఏంటంటే ప్రత్యేకంగా స్పీకర్స్ ఉండవు. టీవీ స్క్రీన్ లో నుంచి శబ్దం వస్తుంది. స్క్రీన్ సౌండ్ చేస్తున్నట్లుగా వీక్షకులు ఫీల్ అవుతారు. ఇది ప్రపంచంలోనే ఫస్ట్ లార్జ్ స్క్రీన్ టెలివిజన్ అని చెప్పొచ్చు.

A1 OLED టీవీకి 65అంగుళాల KD-65A1, KD-55A1 55అంగుళాల స్క్రీన్లో రెండు వేరియంట్లను A1 OLED సీరిస్ సోనీ విడుదల చేసింది. . KD-65A1ధర 4,64,900. 55అంగుళాల స్క్రీన్ టీవీ ధర 3,64,900. సోనీ కొత్త టెలివిజన్ సెట్లలో 8 మిలియన్ల కంటే ఎక్కవ ప్రకాశవంతమైన, వ్యక్తిగతమైన OLED పిక్సెల్స్ ఉన్నాయి. 4కె HDR OLED పానెల్ 3840× 2160 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. 4కె HDR ప్రొసెసర్ X1 ఎక్స్ ట్రీమ్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు సబ్ వూఫర్లు కూడా టీవీతోపాటే వస్తాయి.

ఇక సోనీ OLED TV కొత్త స్లేట్ వన్ కాన్సెప్ట్ డిజైన్ తో రూపొందించారు. స్క్రీన్ లోపల వేరు వేరు ఎలిమినేట్స్ ను కలిగి ఉంటుంది. స్పీకర్ లేదా స్టాండ్ అవసరం లేకుండా ఉంటుంది.

65 అంగుళాల సోనీ బ్రావియా A1 కొలతలు 1451mm×834mm× 86mm సాన్స్ స్టాండ్ తో పాటు 1451mm ×834mm×339mm కలిగి ఉంది. ఇక 55 అంగుళాల సోనీ A1 స్టాండ్ లో లేకుండా 1228 mm x711 mm x 86 mm స్టాండ్ 1228 mm x 711 mm x 339 mm. టెలివిజన్ తో పాటు బ్రావియా వాయిస్ కంట్రోల్ చేసేందుకు ఒక IR బ్లాస్టర్ తోపాటు డిటిహెచ్ రిమోట్ కూడా ఉంటుంది.

ఇక సోనీ కొత్త టెలివిజన్ సీరీస్ లో HDR కంటెంట్ కోసం సపోర్టు ఉంటుంది. 4కె HDR ప్రొసెర్ X1 ఎక్స్ ట్రీమ్ ను కలిగి ఉంటుందని సోనీ సంస్థ తెలిపింది. 4కె ప్రొసెసర్ X1తో పోలిస్తే 40శాతం ఎక్కవ క్వాలిటీ పిక్చర్ ఔట్ పుట్ ను ఇస్తాయి. సోనీ A1 4కెHDR OLDE టీవీల్లో ఆండ్రాయిడ్ 7.0నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు.

దీంతో నెట్ ఫ్లిక్స్, గూగుల్ ప్లే స్టోర్, యూట్యూప్ వంటి యాప్ లను నేరుగా టీవీల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాదు గుర్తింపు పొందిన 42 వేరువేరు భాషలను ఇంగ్లీష్ తో గుర్తిస్తుంది.

ఇక ఈ టీవీల కోసం ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15 వరకు ప్రీ బుకింగ్స్ డీలర్ల నుంచి ప్రారంభం అవుతుంది. ఆగస్టు 4 నుంచి ఇండియాలోని అన్నీ సోనీ స్టోర్లలో అందుబాటులోకి వస్తాయి. అదనంగా సోనీ టెలివిజన్ సెట్ తోపాటు 4 ప్లే స్టేషన్ లను కూడా వినియోగదారులకు అందిస్తుంది.

English summary
The A1 series TVs will be available for sale in stores from August 4.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot