Home
News

చొక్కాకు బుల్లి సోనీ ఏసీ, ధరిస్తే ఒళ్లంతా చల్లదనమే

By Gizbot Bureau

ఎండాకాలం వచ్చిందంటే చాలు బయటకెళ్లడానికే భయపడతాం. కాస్త ఉన్నవాళ్లయితే ఇంట్లో ఎంచక్కా ఏసీ పెట్టుకుంటారు. మరి బయటకెళ్లినప్పుడు పరిస్థితి ఏంటి? సరిగ్గా ఇదే ఆలోచనతో ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సోనీ ఓ కొత్త పోర్టబుల్‌ ఎయిర్ కండిషనర్‌ (ఏసీ)ని తీసుకొచ్చింది. దీనికి ఆ కంపెనీ 'రియాన్‌ పాకెట్‌’గా పేరు పెట్టింది. ఇది మీ ఫోన్ కన్నా చిన్నగానే ఉంటుంది. చొక్కా జేబులో కూడా పెట్టుకోవచ్చు. బ్యాటరీ సాయంతో ఇది పనిచేస్తుంది. ధర తక్కువే. దీని కోసం ప్రత్యేకంగా లోపల ధరించే టీషర్ట్‌ను కూడా ఆ కంపెనీ తీసుకొచ్చింది.

Sony launches wearable AC! Its smaller than a smartphone

క్రౌడ్‌ఫండింగ్ ప్రాజెక్ట్
జర్నీలో ఉన్నప్పుడు లేదా ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఏసీ లేకపోతే 'రియాన్ పాకెట్' ఏసీ వాడుకోవచ్చు. ఈ చిన్న ఏసీ వేసవిలో ఎంతగానే ఉపయోగపడుతుంది. క్రౌడ్‌ఫండింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా సోనీ ఇది తయారుచేసింది. 6.6 కోట్ల యెన్‌ (జపాన్‌ కరెన్సీ) లక్ష్యంగా పెట్టుకోగా.. 2.8 కోట్ల యెన్‌లు ఇప్పటి వరకు సమకూరాయి.
ధర రూ.8,992 మాత్రమే
ఇంతకీ ఈ పోర్టబుల్‌ ఏసీ ధర గురించి చెప్పలేదు కదూ.. అక్షరాల 14,080 యెన్‌లు అంటే మన కరెన్సీ ప్రకారం రూ.8,992 అన్నమాట. లోపల ధరించే టీషర్ట్‌తో కలిపి ఈ ధరకు కంపెనీ విక్రయిస్తోంది. లోపలి టీషర్ట్‌ S,M,L సైజుల్లో లభిస్తాయి. ఒకవేళ డివైజ్‌తో పాటు ఐదు టీషర్ట్స్ కావాలంటే రూ.12,000 చెల్లించాలి.

Sony launches wearable AC! Its smaller than a smartphone

కారు లేదా వైన్ కూలర్స్‌లో ఉపయోగించే టెక్నాలజీతో పాకెట్ ఏసీని సోనీ రూపొందించింది. లిథియమ్ ఇయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. 2 గంటలు ఛార్జ్ చేస్తే చాలు రోజంతా ఉపయోగించుకోవచ్చు. వాటర్‌ ప్రూఫ్‌తో ఇది వస్తోంది. అయితే ఇది కేవలం పురుషులకు మాత్రమే. ప్రస్తుతం ఈ ప్రొడక్ట్ కేవలం జపాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.భారత్‌కు తీసుకొచ్చేదీ లేనిదీ తెలియాల్సి ఉంది. బ్యాటరీతో నడిచే ఈ పాకెట్‌ ఏసీ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా బ్లూటూత్‌ ఉపయోగించి నియంత్రిచొచ్చు. బ్లూటూత్‌ 5.0తో ఇది పనిచేస్తుంది. రెండు గంటల పాటు ఛార్జింగ్‌ చేస్తే 90 నిమిషాల పాటు వాడుకోవచ్చు.

రియాన్ పాకెట్ బ్లూటూత్ 5.0LE సపోర్టుతో ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. వేరబుల్ AC డివైజ్ వాటర్ ప్రూఫ్ కాదని గుర్తించుకోవాలి. కానీ, యాంటీ డర్ట్, చెమట, వాటర్ డ్రాప్ లెట్స్‌తో పాటు హైగ్రోస్కోపిక్ సాఫ్ట్ క్లాత్‌కు స్టిక్ అయి ఉండేలా ఉంటుంది.

Best Mobiles in India

English summary
Sony launches wearable AC! It's smaller than a smartphone, costs about Rs 9,000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X