విప్లవాత్మక ఫీచర్లతో సోనీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

Written By:

బార్సిలోనాలో జరుగుతోన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016ను పురస్కరించుకుని సోనీ తన సరికొత్త ఎక్స్‌పీరియా ఎక్స్ సిరీస్ నుంచి మూడు ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రపంచానికి పరిచయం చేసింది. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి... ఎక్స్‌పీరియా ఎక్స్ (Xperia X), ఎక్స్‌పీరియా ఎక్స్ఏ (Xperia XA),ఎక్స్‌పీరియా ఫెర్మామెన్స్ (Xperia X Performance).

విప్లవాత్మక ఫీచర్లతో సోనీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు 5 అంగుళాల డిస్‌ప్లేలతో రానున్నాయి. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై ఇవి రన్ అవుతాయి. ప్రీమియమ్ డిజైనింగ్ ఇంకా మెరుగుపరచబడిన కెమెరా, బ్యాటరీ ఫీచర్లు ఈ ఫోన్‌లకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఫోన్ లతో పాటు మూడు సరికొత్త యాక్సెసరీస్ ను సోనీ ఆవిష్కరించింది. ఎక్స్‌పీరియా ఇయర్ (Xperia Ear), ఎక్స్‌పీరియా ఐ (Xperia Eye), ఎక్స్‌పీరియా ప్రొజెక్టర్ (Xperia Projector).

Read More : ఆన్‌లైన్‌లో ఓటు గుర్తింపు కార్డును పొందటం ఏలా..?

ఎక్స్‌పీరియా ఇయర్‌ను స్మార్ట్ బ్లుటూత్ హెడ్‌సెట్‌లా వాడుకోవచ్చు. ఈ డివైస్ వాయిస్ కమాండ్‌లను స్వీకరించి అందుకు అనుగుణంగా వ్యవహరించుకోగలదు. మరో డివైస్ ఎక్స్‌పీరియా ఐ వేరబుల్ కెమెరాలో ఉపయోగపడుతుంది. వాయిస్ ఇంకా ఫేస్ రికగ్నిషన్ ఫీచర్లను ఈ డివైస్ సోపర్ట్ చేస్తుంది.

Read More : గెలాక్సీ ఎస్7 వచ్చేసింది

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో చోటు చేసుకున్న సోనీ ఆవిష్కరణలకు సంబంధించి ఆసక్తికర వివరాలు క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విప్లవాత్మక ఫీచర్లతో సోనీ కొత్త ప్రోడక్ట్స్

ఎక్స్‌పీరియా ఎక్స్ సిరీస్ సోనీ లాంచ్ చేసిన కొత్త స్మార్ట్‌ఫోన్‌లకు బ్యాటరీ లైఫ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ ఫోన్లలో పొందుపరిచిన Qnovo's అడాప్టిక్ చార్జింగ్ టెక్నాలజీ 2 అలానే సోనీ స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టంలు బ్యాటరీ పనితీరను మరింత సమర్థవంతం చేస్తుంది. సింగిల్ ఫుల్ చార్జ్ పై రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను యూజర్లు ఆశించవచ్చు.

 

విప్లవాత్మక ఫీచర్లతో సోనీ కొత్త ప్రోడక్ట్స్

ఎక్స్‌పీరియా ఎక్స్ సిరీస్ నుంచి వస్తోన్న ఎక్స్‌పీరియా ఎక్స్ ఫోన్ శక్తివంతమైన Qualcomm® SnapdragonTM 650 ప్రాసెసర్‌తో, ఎక్స్‌పీరియా ఎక్స్ ఫెర్మామెన్స్ Qualcomm® SnapdragonTM 820 ప్రాసెసర్‌తో వచ్చాయి. ఈ ప్రాసెసర్లు అల్ట్రా ఫాస్ట్ కనెక్టువటీని చేరువ చేస్తాయి.

 

విప్లవాత్మక ఫీచర్లతో సోనీ కొత్త ప్రోడక్ట్స్

ఎక్స్‌పీరియా ఎక్స్ సిరీస్ వస్తోన్న ప్రతి స్మార్ట్‌ఫోన్, కర్వుడ్ డిస్‌ప్లేతో క్లాసికల్ అప్పీల్‌కు లోను చేస్తాయి. ఎక్స్‌పీరియా ఎక్స్, ఎక్స్‌పీరియా ఎక్స్ఏ, ఎక్స్‌పీరియా ఫెర్మామెన్స్ ఫోన్‌లు వివిధ మ్యాచింగ్ స్టైల్ కవర్‌లతో రాబోతున్నాయి.

 

విప్లవాత్మక ఫీచర్లతో సోనీ కొత్త ప్రోడక్ట్స్

ఎక్స్‌పీరియా ఎక్స్ ఫోన్‌లో ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్ వ్యవస్థను సోనీ పొందుపరిచింది. ఫోన్ సైడ్ భాగంలో ఏర్పాటు చేసిన ఈ సెన్సార్ ద్వారా ఫోన్‌ను ఒక్క మూమెంట్‌లో అన్‌లాక్ చేయవచ్చు.

 

విప్లవాత్మక ఫీచర్లతో సోనీ కొత్త ప్రోడక్ట్స్

ఎక్స్‌పీరియా ఇయర్‌‌ను సోనీ నుంచి విడుదలైన తరువాతి వర్షన్ వైర్‌లెస్ ఇయర్-పీస్‌గా అభివర్ణించవచ్చు. ఈ ఇయర్ - పీస్ వ్యక్తిగత అసిస్టెంట్‌లా వ్యవహరిస్తూ  షెడ్యూల్, వాతావరణం వంటి తాజా సమచారాన్ని అప్ టు డేట్‌గా ఆన్ ద గోలో మీకు అందించగలదు. సోనీ వాయిస్ టెక్నాలజీతో స్పందించే ఈ ఇయర్ పీస్ వెర్బల్ కమాండ్స్‌కు రెస్పాండ్ అవుతుంది. వాయిస్ కమాండ్స్ ఇవ్వటం ద్వారా ఇంటర్నెట్ సెర్చ్, మెసేజ్ డిక్టేట్ లేదా నావిగేట్, లోకేషన్ వంటి పనులను ఈ ఇయర్ పీస్ చక్కబెట్టేస్తుంది.

 

విప్లవాత్మక ఫీచర్లతో సోనీ కొత్త ప్రోడక్ట్స్

ఈ అల్ట్రా కాంపాక్ట్ డివైస్ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరాతో వస్తోంది. ఈ డివైస్‌ను మీ దుస్తులకు సలువుగా అటాచ్ చేయవచ్చు. ఎక్స్‌పీరియా ఐలో పొందుపరిచిన ఇంటెలిజెంట్ షట్టర్ టెక్నాలజీ ఫేషియల్ అలానే వాయిస్ డిటెక్షన్ ఆధారంగా ఫోటోలను చిత్రీకరించగలదు.

 

విప్లవాత్మక ఫీచర్లతో సోనీ కొత్త ప్రోడక్ట్స్

ఎక్స్‌పీరియా ప్రొజెక్టర్ కాన్సెప్ట్ మీ ఫ్యామిలీ కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత విప్లవాత్మకం చేసేస్తుంది. ఈ డివైస్ అందించే ఇంటరాక్టివ్ ఇంటర్‌ఫేస్ ప్రొజెక్షన్ సహజ సిద్ధంగా ఉంటుంది. ఎలాంటి క్లియర్ సర్‌ఫేస్ మీద అయిన ఈ డివైజ్ ప్రొజెక్ట్ చేయగలదు. టచ్, వాయిస్ ఇంకా గెస్ట్యర్ కమాండ్ లను ఈ ప్రొజెక్టర్ సపోర్ట్ చేస్తుంది.

 

విప్లవాత్మక ఫీచర్లతో సోనీ కొత్త ప్రోడక్ట్స్

సోనీ వాయిస్ టెక్నాలజీతో వస్తోన్న ఈ వినూత్న డివైస్‌ను పర్సనల్ అసిస్టెంట్‌లా వాడుకోవచ్చు. అనేక వాయిస్ కమాండ్‌లను ఈ డివైస్ సపోర్ట్ చస్తుంది. ప్రత్యేకమైన కెమరా వ్యవస్థను ఈ డివైస్‌లో పొందుపరిచారు. ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ డిస్‌ప్లే ద్వారా కంటెంట్‌ను సర్‌ఫేస్ పై ప్రొజెక్ట్ చేయవచ్చు.

 

విప్లవాత్మక ఫీచర్లతో సోనీ కొత్త ప్రోడక్ట్స్

ఈ ఇన్-కార్ బ్లూటూత్ కమాండర్ ద్వారా వైర్‌లెస్ మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు. ఈ డివైస్‌లో పొందుపరిచిన సోనీ వాయిస్ టెక్నాలజీని స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని సౌకర్యవంతమైన డ్రైవింగ్‌ను ఆస్వాదించవచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sony Newly Launched Xperia X Series: 10 Interesting Things to Know!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot