Home
News

Sony PS5 ప్రీ-ఆర్డర్స్ మొదలు కానున్నాయి!! ఇండియా లాంచ్ త్వరలోనే...

సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ (SIE) యొక్క సరికొత్త గేమింగ్ కన్సోల్ సోనీ ప్లేస్టేషన్ 5 (PS5)ను ఇండియాలో 2021 ఫిబ్రవరి 2 న ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. సోనీ కార్పొరేషన్ యాజమాన్యంలోని SIE ప్లేస్టేషన్ ఉత్పత్తులలో PS5 గురించి మొదటగా జూన్, 2020 లో జరిగిన వర్చువల్ ఈవెంట్‌లో ప్రకటించింది. PS5 యొక్క సిరీస్ ను డిఫినిషన్ (యుహెచ్‌డి) బ్లూ-రే డిస్క్ డ్రైవ్ మరియు డిస్క్ డ్రైవ్ లేకుండా డిజిటల్ ఎడిషన్ వంటి రెండు మోడళ్లలో అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

భారతదేశంలో సోనీ ప్లేస్టేషన్ 5 లాంచ్ & ప్రీ-ఆర్డర్ డేట్

భారతదేశంలో సోనీ ప్లేస్టేషన్ 5 లాంచ్ & ప్రీ-ఆర్డర్ డేట్

ఇండియాలో సోని సంస్థ తన యొక్క కొత్త ప్లేస్టేషన్ 5 ను ఫిబ్రవరి 2న లాంచ్ చేయనున్నది. అయితే దీని యొక్క ప్రీ-ఆర్డర్‌లు 2021 జనవరి 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ నుండి కన్సోల్‌ యొక్క ప్రీ-ఆర్డర్ ను ఆర్డర్ చేయవచ్చని తెలిపారు. యుఎస్ మరియు కెనడాతో సహా మరిన్ని కీలక మార్కెట్లలో 2020 నవంబర్ 12 న సోని PS5 సిరీస్‌ను కంపెనీ విడుదల చేసింది. అయితే తరువాత గ్లోబల్ రోల్అవుట్ నవంబర్ 19 నుండి మొదలైనది.

సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ CEO

సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ అధ్యక్షుడు మరియు CEO జిమ్ ర్యాన్ పత్రిక సమావేశంలో మాట్లాడుతూ గత సంవత్సరం PS5 సిరీస్‌ కన్సోల్‌ను మొదటి సారిగా ప్రకటించినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ అభిమానుల కోసం డెవలపర్ల నుంచి అద్భుతమైన మద్దతు లభించింది అని ఒక ప్రకటనలో తెలిపారు.

సోనీ ప్లేస్టేషన్ 5 సిరీస్ ధరల వివరాలు

సోనీ ప్లేస్టేషన్ 5 సిరీస్ ధరల వివరాలు

సోనీ సంస్థ అక్టోబర్ 2020 లో ప్రకటించిన తన PS5 సిరీస్ యొక్క ఇండియా ధరను కూడా ప్రకటించింది. ఇందులో ఎంట్రీ లెవల్ డిజిటల్ ఎడిషన్ యొక్క ధర 39,990 రూపాయలు. అలాగే యుహెచ్‌డి డిస్క్ డ్రైవ్‌తో కూడిన PS5 స్టాండర్డ్ ఎడిషన్ యొక్క ఇండియా ధర రూ.49,990 అని కంపెనీ తెలిపింది.

సోనీ ప్లేస్టేషన్ 5 సిరీస్ vs మైక్రోసాఫ్ట్ తాజా గేమింగ్ కన్సోల్‌

సోనీ ప్లేస్టేషన్ 5 సిరీస్ vs మైక్రోసాఫ్ట్ తాజా గేమింగ్ కన్సోల్‌

ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎస్ మరియు ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్, మైక్రోసాఫ్ట్ నుండి వచ్చిన తాజా గేమింగ్ కన్సోల్‌ల ధరలు వరుసగా రూ.34,990 మరియు రూ.49,990 ధరను కలిగి ఉన్నాయి. అలాగే మైక్రోసాఫ్ట్ యొక్క తాజా గేమింగ్ కన్సోల్‌లు 2020 నవంబర్‌లో భారతదేశంలో విడుదలయ్యాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Sony PlayStation 5(PS5) Plan to Launch in India on February 2: Price, Specs, Sale Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X