Home
News

Sony PS5, PS5 డిజిటల్ ఎడిషన్ గేమింగ్ కన్సోల్‌ల ప్రీ-ఆర్డర్‌లు మొదలుకానున్నాయి...

సోనీ సంస్థ గేమింగ్ ప్రియుల కోసం ముందు నుంచి కూడా ప్లేస్టేషన్ లను అందిస్తోంది. ఈ సంస్థ 2019 లో ప్రకటించిన ప్లేస్టేషన్ 5 మరియు ప్లేస్టేషన్ 5 డిజిటల్ ఎడిషన్ గేమింగ్ కన్సోల్‌లను పొందడం కష్టంగా ఉంది. ఈ గేమింగ్ కన్సోల్‌లకు నిరంతరం డిమాండ్ పెరుగుతుండడంతో పాటుగా గ్లోబల్ చిప్ కొరత కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. సోనీ సంస్థ తన యొక్క PS5 మరియు PS5 డిజిటల్ ఎడిషన్ గేమింగ్ కన్సోల్‌లను పునఃప్రారంభించడాన్ని ప్రకటించడంతో వాటికి డిమాండ్‌ మరింత పెరిగింది.

సోనీ బ్రాండ్

భారతదేశంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సోనీ బ్రాండ్ యొక్క ప్లేస్టేషన్ 5 మరియు ప్లేస్టేషన్ 5 డిజిటల్ ఎడిషన్ గేమింగ్ కన్సోల్‌లు ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయని సోనీ సంస్థ ధృవీకరించింది. లభ్యత విషయానికొస్తే ఈ రెండు గేమింగ్ డివైస్లు సోనీ కంపెనీ యొక్క అధికారిక ఆన్‌లైన్ స్టోర్ సోనీ సెంటర్‌లో అందుబాటులో ఉండటంతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, గేమ్ లూట్ మరియు విజయ్ సేల్స్‌తో సహా ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో కూడా అందుబాటులో ఉంటాయి.

సోనీ ప్లేస్టేషన్ 5, ప్లేస్టేషన్ 5 డిజిటల్ ఎడిషన్ ధరలు

సోనీ ప్లేస్టేషన్ 5, ప్లేస్టేషన్ 5 డిజిటల్ ఎడిషన్ ధరలు

సోనీ కంపెనీ అందించే ప్లేస్టేషన్ 5 మరియు ప్లేస్టేషన్ 5 డిజిటల్ ఎడిషన్ గేమింగ్ కన్సోల్‌ల యొక్క ధరల విషయానికి వస్తే ఇవి ప్రీ-ఆర్డర్ సమయంలో సోనీ ప్లేస్టేషన్ 5 గేమింగ్ కన్సోల్ రూ.49,990 ధర వద్ద మరియు సోనీ ప్లేస్టేషన్ 5 డిజిటల్ ఎడిషన్ రూ.39,990 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. దీనితో పాటుగా ప్రీ-ఆర్డర్ ఆఫర్‌లో కేవలం రూ.54,490 ధరకే ప్లేస్టేషన్ 5 మరియు గ్రాన్ టర్సిమో 7 స్టాండర్డ్ ఎడిషన్ ను అందిస్తోంది. ప్రీ-ఆర్డర్ తరువాత ఈ గేమింగ్ కన్సోల్‌లు భారతదేశంలో దాదాపు రూ.55,000 ధర వద్ద లభిస్తుంది.

సోనీ ప్లేస్టేషన్ 5, ప్లేస్టేషన్ 5 డిజిటల్ ఎడిషన్ ఆఫర్‌లు

సోనీ ప్లేస్టేషన్ 5, ప్లేస్టేషన్ 5 డిజిటల్ ఎడిషన్ ఆఫర్‌లు

సోనీ కంపెనీ ప్రీ-ఆర్డర్ విభాగంలో ప్లేస్టేషన్ 5 మీద రూ.8,331 మరియు ప్లేస్టేషన్ 5 డిజిటల్ ఎడిషన్ గేమింగ్ కన్సోల్ మీద రూ.6,665 తగ్గింపును అందిస్తోంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికని కూడా అందిస్తోంది. కాంబో ఆఫర్‌ని ఎంచుకునే గేమ్ ఔత్సాహికుల కోసం కంపెనీ రూ.9,801ల తక్కువ ధరని అందిస్తోంది.

Sony PS5, PS5 డిజిటల్ ఎడిషన్ గేమింగ్ కన్సోల్‌ను కొనుగోలు చేసే విధానం

Sony PS5, PS5 డిజిటల్ ఎడిషన్ గేమింగ్ కన్సోల్‌ను కొనుగోలు చేసే విధానం

PS5 మరియు PS5 డిజిటల్ ఎడిషన్ గేమింగ్ కన్సోల్‌లను మీరు కొనుగోలు చేయడానికి లేదా మీ చేతులలో పొందడానికి మీకు అనేక ఉపాయాలు ఉన్నాయి.

** వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ని కలిగి ఉండండి.

** దీనిని పొందడానికి కేవలం ఒక స్టోర్‌పై ఆధారపడవద్దు. PS5 రీస్టాక్ ప్లాట్‌ఫారమ్‌లలో జరుగుతుంది కాబట్టి మీ అవకాశాలను పెంచుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ మరియు రిలయన్స్ డిజిటల్ వంటి బహుళ ప్లాట్‌ఫారమ్‌లలో పరికరాన్ని ముందస్తుగా బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి.

** సహాయం కోరేందుకు సిగ్గుపడకండి. గేమింగ్ కన్సోల్‌ను ప్రీ-బుక్ చేయమని మీ స్నేహితులను మరియు కుటుంబ సభ్యులను కూడా అడగండి. ఇది మీ గేమింగ్ కన్సోల్‌ను పొందే అవకాశాలను గణనీయంగా పెంచుతుంది.

 

Best Mobiles in India

English summary
Sony PS5, PS5 Digital Edition Pre-Orders Begins Today 12 PM in India: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X