సవాల్ విసురుతున్న సోనీ!!

Posted By: Staff

సవాల్ విసురుతున్న సోనీ!!

 

ప్రస్తుత మార్కెట్లో అనేక రకాలైన స్మార్ట్‌వాచ్‌లు లభ్యమవుతున్నాయి. వీటిలో సోనీ రూపొందించిన పెబ్బిల్ స్మార్ట్ వాచ్‌కు అనూహ్య రీతిలో ఆదరణను నెలకుంది. ఈ స్మార్ట్ గ్యాడ్జెట్ కొత్త బ్రాండ్లకు సవాల్ విసురుతుంది. తాజాగా ఈ డివైజ్‌కు కొత్త అపడేట్‌లను సోనీ వర్గాలు ప్రకటించాయి. ఈ తాజా నవీకరణతో స్మార్ట్‌వాచ్‌లోకి పజిల్ గేమ్ అదేవిధంగా మ్యూజిక్ ప్లేయర్లు అదనంగా వచ్చి చేరతాయి. వాచ్ వినియోగంలో భాగంగా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌కు బ్లూటూత్ ఆధారితంగా జత చేసుకోవల్సి ఉంటుంది.

వాచ్‌లో ఒదిగి ఉన్నవిశిష్టమైన ఫీచర్లు:

1.3 అంగుళాల OLED డిస్ ప్లే,

ఈ స్ర్కీన్ ద్వారా యూజర్ తాజా అప్ డేట్ లను తెలుసుకోవటంతో పాటు అనేక సౌలభ్యతలను పొందవచ్చు,

వాచ్ ను ఆండ్రాయిడ్ ఫోన్ కు రిమోట్ లా ఉపయోగించుకోవచ్చు,

మ్యూజిక్ వినోదాలతో పాటు గేమింగ్ అనుభూతులను ఈ వాచ్ ద్వారా ఆస్వాదించవచ్చు.

‘బర్గ్’ రిస్ట్‌వాచ్ మొబైల్ ఫోన్‌:

రిస్ట్‌వాచ్ మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్ధ బర్గ్, తన వ్యాపారాన్ని భారత్‌‍లో మరింత విస్తరించనుంది. ఈ ప్రముఖ నెదర్లాండ్స్ సంస్థ రూ.9,000 – రూ. 24,000 ధరల మధ్య పలు మోడల్స్‌లో రిస్ట్‌వాచ్ ఫోన్‌లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. చేతి వాచ్ తరహాలో డిజైన్ కాబడిన ఈ డివైజులో సిమ్ ట్రే అదే విధంగా డయల్ చేసేందుకు అనువుగా నంబర్ కీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. బ్లూటూత్ హెడ్‌సెట్ ఆధారితంగా డైలింగ్, రిసీవింగ్ ప్రక్రియ నిర్వహించుకోవల్సి ఉంటుంది.

ఈ రిస్ట్‌వాచ్ కమ్ ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే:

ఇంటర్నెట్ కనెక్టువిటీ,

ఎంపీత్రీ ప్లేయర్,

ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (3x జూమ్),

వీడియో రికార్డర్,

ఇమేజ్ వ్యూవర్,

ఆలారమ్ క్లాక్,

ఫోన్ బుక్ స్టోరేజ్ (500 ఎంట్రీల వరకు),

మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot