సోనీలో 10,000 ఉద్యోగాలు కట్..?

Posted By: Super

సోనీలో 10,000 ఉద్యోగాలు కట్..?

 

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ కార్పొరేషన్ భారీగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నష్టాల్లో ఉన్న కంపెనీని తిరిగి లాభాల బాట పట్టించే చర్యల్లో భాగంగా వచ్చే ఏడాదిలోపు దాదాపు 10,000 మంది సిబ్బందిని సోనీ తొలగించనుందని జపాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. టీవీ అమ్మకాలు ఆశాజనకంగా లేకపోవడంతో నష్టాలు భారీగా పేరుకుంటున్నాయని, దీంతో కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్యలో 6 శాతం మేర కోత విధించేందుకు సోనీ నిర్ణయించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఈ ప్రభావం భారత్ పై ఉంటుందా..?

భారత్‌లో ఎలాంటి సిబ్బంది కోత చర్యలూ ఉండబోవని సోనీ ఇండియా పేర్కొంది. సిబ్బంది తగ్గింపునకు సంబంధించి తమ మాతృసంస్థ అయిన సోనీ కార్పొరేషన్ ఎలాంటి వివరాలూ ప్రకటించలేదని సోనీ ఇండియా అధికారప్రతినిధి యోకో యసుకోచి చెప్పారు. ఉద్యోగాల కోత వార్తలపై స్పందిస్తూ ఆమె ఈ విషయాలను వెల్లడించారు. ‘భారత్ కార్యకలాపాల విషయంలో కంపెనీ మంచి వృద్ధినే కనబరుస్తోంది. అందువల్ల ఇక్కడ సమీప భవిష్యత్తులో సిబ్బంది మార్పుచేర్పులకు సంబంధించి ఏవిధమైన ప్రణాళికలూ లేవు’ అని ఆమె పేర్కొంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot