సోనీ నుంచి తొలి బీజిల్ లెస్ ఫోన్

Posted By: BOMMU SIVANJANEYULU

స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో బీజిల్-లెస్ డిజైన్ లేటెస్ట్ ట్రెండ్‌గా నిలిచిన నేపథ్యంలో జపాన్ బ్రాండ్ సోనీ తన మొట్ట మొదటి బీజిల్-లెస్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. తాజాగా లీకైన ఇమేజ్‌ను బట్టి చూస్తుంటే సోనీ అప్‌కమ్మింగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ భిన్నమైన డిజైన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇమేజ్ ప్రకారం.. సోనీ బీజిల్ లెస్ ఫోన్ H8541 మోడల్ నెంబర్‌తో రాబోతోంది. స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి..

సోనీ నుంచి తొలి బీజిల్ లెస్ ఫోన్

5.7 అంగుళాల 4కే హెచ్‌డీఆర్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3420 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్, బ్లుటూత్ 5.0, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషేన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఐపీ68 సర్టిఫికేషన్.

ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే బీజిల్-లెస్ స్ర్కీన్‌లతో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఆదరణను బట్టి చూస్తుంటే 2018లో లాంచ్ కాబోయే ప్రతి పోన్ బీజిల్-లెస్ స్ర్కీన్ కలిగి ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Redmi 5Aపై ఆఫర్లు, రూ. 3999కే సొంతం చేసుకోమంటున్న జియో

బీజిల్-లెస్ స్ర్కీన్‌తో వచ్చే ఫోన్ ముందు భాగం దాదాపుగా డిస్‌ప్లేతో కవర్ అయి ఉంటుంది. అంచులు అనేవి చాలా సన్నగా ఉంటాయి. ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 8, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8, ఎల్‌జీ జీ7, ఎసెన్షియల్ ఫోన్, షిమోమి ఎంఐ మిక్స్ వంటి స్మార్ట్‌ఫోన్‌లు బీజిల్-లెస్ స్ర్కీన్‌లతో వస్తున్నాయి.

Read more about:
English summary
According to a new leak, Sony's upcoming flagship will finally come with a different design.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot