సోనీ నుంచి కొత్తరకం పెన్‌డ్రైవ్‌లు

Posted By:

డేటా స్టోరేజ్ విభాగంలో కొత్త సంస్కృతికి తెరలేపుతూ జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కంపెనీ సోనీ సరికొత్త  పెన్‌డ్రైవ్‌లను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ పెన్‌డ్రైవ్‌లు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ట్యాబ్లెట్ పీసీలనూ సపోర్ట్ చేస్తాయి. ఈ 2 ఇన్ 1స్టోరేజ్ డివైజ్‌లను మైక్రోయూఎస్బీ 2.0 ఇంకా యూఎస్బీ కనెక్టర్‌ల ద్వారా ల్యాప్‌టాప్ ఇంకా డెస్క్‌టాప్ కంప్యూటర్లకు అనుసంధానించుకోవచ్చు.

సోనీ నుంచి కొత్తరకం పెన్‌డ్రైవ్‌లు

ఈ పెన్‌డ్రైవ్‌‌లను డేటా స్టోరేజ్ పరికరాలుగానే కాకుండా స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు అదనపు ఇంకా తాత్కాలిక స్టోరేజ్‌లా ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఇంకా ఐస్‌క్రీమ్ ఆపరేటింగ్ సిస్టంలను ఈ డ్రైవ్‌లు సపోర్ట్ చేస్తాయని సోనీ ఎలక్ట్రానిక్స్ వినియోగదారుల మీడియా మార్కెటింగ్ డైరెక్టర్ వివియానో కాంటు పేర్కొన్నారు.

మూడు కలర్ వేరియంట్‌లలో ఈ పెన్‌డ్రైవ్‌లు లభ్యమవుతాయి. ఈ మెటల్ బాడీ పెన్‌డ్రైవ్‌లను 8, 16 ఇంకా 32జీబి మెమరీ  వర్షన్‌లలో పొందవచ్చు. 2014 జనవరి నుంచి ఈ డివైజ్‌లు మార్కెట్లో లభ్యమయ్యే అవకాశముంది.

ధరల అంచనా:

8GB - $19.99 (రూ.1,230)
16GB - $29.99 (రూ.1,846)
32GB - $62.99 (రూ.3,877)

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot