Home
News

Sony నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది! ధర,స్పెసిఫికేషన్ల వివరాలు 

By Maheswara

ఒకప్పుడు ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ అయిన సోనీ,ఇప్పుడు Sony Xperia1 V స్మార్ట్ ఫోన్ ను యూరోపియన్ మరియు గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ Exmor T ఇమేజ్ సెన్సార్ మరియు 4K HDR డిస్‌ప్లే ఫీచర్లతో వస్తుంది. ఇది సోనీ Xperia 1 IV కి కొనసాగింపుగా వస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్, స్నాప్ డ్రాగన్ 8 Gen 2 SoC ప్రాసెసర్ తో వస్తుంది.ఇది 12GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజీతో జత చేయబడి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4K HDR మద్దతు కలిగి ఉంటుంది. మరియు 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది IP65/68 నీటి నిరోధకతను కూడా అందిస్తుంది మరియు 5,000mAh బ్యాటరీకి మద్దతు ఇస్తుంది.

Sony Xperia 1 V With 4K Hdr Display Launched In European Market, Price And Specifications Details.

సోనీ Xperia 1 V ధర, లభ్యత వివరాలు
సోనీ సంస్థ యూరోపియన్ మార్కెట్‌లో కొత్తగా విడుదల చేసిన ఈ సోనీ ఎక్స్‌పీరియా 1 V ధర $1,399 (దాదాపు రూ. 1,14,700). ఇది గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ ఫోన్ ఒకే ఒక 12GB RAM + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ఇది జూన్‌లో యూరప్‌లో సేల్ కు రాబోతుందని భావిస్తున్నారు.

సోనీ Xperia 1 V స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు
ఈ సోనీ స్మార్ట్ ఫోన్, 21:9 సినిమావైడ్ 4K HDR, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు మద్దతు కలిగిన, 6.5 అంగుళాల OLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇంకా,ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 SoC ద్వారా 12GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజీ తో జత చేయబడింది. ఈ సోనీ Xperia 1 V కొత్త Exmor T ఇమేజ్ సెన్సార్‌తో వస్తుంది.

ఇక ఈ ఫోన్ యొక్క కెమెరాల విషయానికి వస్తే, సోనీ Xperia 1 V ,హైబ్రిడ్ OIS/EIS మద్దతుతో 52 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇంకా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 3.5-5x ఆప్టికల్ జూమ్ మరియు 15.6X హైబ్రిడ్ జూమ్‌తో మరో 12-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ కూడా ఉంది.

ఇంకా, ఈ ఫోన్ యొక్క 85-125 mm (F2.3-F2.8) ఆప్టికల్ జూమ్ లెన్స్‌ని అందించే దాని అల్ట్రా-వైడ్ కెమెరాలో 4K వీడియో రికార్డింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది S-సినిటోన్ మరియు క్రియేటివ్ లుక్ వంటి కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. ముందు భాగంలో, ఈ ఫోన్ 12- మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

సోనీ Xperia 1 V 30W (USB PD) ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇక ఈ ఫోన్ యొక్క కొలతలు చూస్తే 165 x 71 x 8.3 మిమీ మరియు బరువు 187 గ్రా. ఇతర ఫీచర్లలో IP65/68 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 mm ఆడియో జాక్ మరియు 360 రియాలిటీ ఆడియో సపోర్ట్ ఫీచర్లు ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Sony Xperia 1 V With 4K Hdr Display Launched In European Market, Price And Specifications Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X