సోనీ అభిమానులకు ఆన్‌లైన్ ఆఫర్!!

Posted By: Prashanth

సోనీ అభిమానులకు ఆన్‌లైన్ ఆఫర్!!

 

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ సోనీ ‘ఎక్స్‌పీరియా ఎస్’ పేరుతో హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. గ్యాడ్జెట్ ప్రియుల నుంచి విశేష ఆదరణను చొరగుంటున్న ఈ హ్యాండ్‌సెట్ బ్రాండ్ విలువను మరింత పెంచింది. ఈ క్రమంలో సోనీ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న మరో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్‌పీరియా యూ’ను లెట్స్‌బుయ్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ రిటైలర్ సంస్థలు రూ.17399, రూ.16,499 ధరలకు ఆఫర్ చేస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా బార్సిలోనాలో నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ఆవిష్కరించారు. ఏప్రిల్ నాటికి డివైజ్‌ను భారత్‌లో అందుబాటులోకి తెస్తామని సోనీ వర్గాలు ప్రకటించాయి.

‘సోనీ ఎక్స్‌‌పీరియా యూ’ ముఖ్య ఫీచర్లు:

3.5 అంగుళాల స్ర్కాచ్ ప్రూఫ్ టచ్‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం (త్వరలోనే ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌ వోఎస్‌ను అప్‌డేట్ చేసుకునే సౌలభ్యత),

512ఎంబీ ర్యామ్,

డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ ఎస్‌టీఈ యూ8500 ప్రాసెసర్,

5 మెగా పిక్సల్ కెమెరా (16xడిజిటల్ జూమ్, ఎల్ఈడి ఫ్లాష్, ఆటోఫోకస్),

వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

వై-ఫై కనెక్టువిటీ,

బ్లూటూత్ వర్షన్ 2.1,

బ్యాటరీ టాక్‌టైమ్ 6 గంటల 36 నిమిషాలు, స్టాండ్‌బై 472 గంటలు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot