సోనీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్!

Posted By: Madhavi Lagishetty

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సోనీ, ఇండియన్ మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. గత నెలలో ఎక్స్‌పీరియా ఎక్స్ జెడ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన సోనీ సంస్థ.. ఇప్పుడు సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ ఏ1 ఆల్ట్రా పేరుతో నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.  ధర రూ.29,990. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ అవుట్ లెట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. బ్లాక్, వైట్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో డివైస్‌ను ఎంపిక చేసుకోవచ్చు. 

సోనీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్!

ఎక్స్‌పీరియా ఎక్స్ ఏ1 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను సోనీ ప్రకటించింది. రూ.1490 ఖరీదు చేసే యూసీహెచ్ 12 చార్జర్ ఫోన్‌తో పాటు లభిస్తుంది. చార్జర్‌తో పాటు స్టైలీష్ కవర్ స్టాండ్‌కు వెయ్యి రూపాయలు తగ్గిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. 23 మెగా పిక్సెల్ రియర్ కెమెరా ఈ స్మార్ట్‌ఫోన్‌కు ప్రధాన హైలైట్. సోనీ ఫోన్లలో అత్యధిక మెగా పిక్సెల్ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్ ఇదే.

సోనీ ఎక్స్ పీరియా ఎక్స్ ఏ1 ఆల్ట్రా స్పెషిఫికేషన్స్....

•  6 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే విత్ 1080×1920 పిక్సల్ రిజల్యూషన్ 

•  ఆక్టా-కోర్ 64 బిట్ మీడియా టెక్ హీలియో ప్రాసెసర్

•  4జీబి ర్యామ్, 64 జీబి ఇంటర్నల్ స్టోరేజీ

•   ఎస్డీ కార్డుతో పాటు 256జీబి వరకు ఎక్స్ పాండబుల్ మెమొరీ

•   23 మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్  5 ఎక్స్ జూమ్ ఇంకా హెచ్‌డి ఆర్ మోడ్ సౌలభ్యం

•   2700ఎంఏహేచ్ బ్యాటరీ సామర్ధ్యం

•   ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 

•   16మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 23 ఎంపీ రేర్ ఫేసింగ్ కెమెరా,

English summary
Priced at Rs. 29,990, the Sony Xperia XA1 Ultra is available in Black, White and Gold color options.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot