Home
News

వావ్, గేమింగ్‌ చరిత్రలో తొలిసారి.. వాసనలు కూడా ఫీల్ అవ్వొచ్చు.. సోనీ కాన్సెప్ట్ అదిరింది!

By Ram Kumar

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ ప్రతిసారి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES)లో సరికొత్త ఆవిష్కరణలతో కనువిందు చేస్తుంటుంది. ఈసారి, అంటే CES 2025లో సోనీ ప్రవేశపెట్టిన "ఫ్యూచర్ ఇమ్మర్సివ్ ఎంటర్‌టైన్‌మెంట్ కాన్సెప్ట్" అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది గేమింగ్ ప్రపంచాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లే సరికొత్త ఆలోచన.

ఇకపై వీడియో గేమ్స్ కేవలం కళ్లతో చూసే అనుభూతి మాత్రమే కాదు, శబ్దాలు వినడం, స్పర్శ ద్వారా ఫీల్ అవ్వడం మాత్రమే కాదు.. ఏకంగా ఆ గేమ్ వాతావరణంలోని వాసనలు కూడా మీరు అనుభూతి చెందొచ్చు. అవును, సోనీ సరికొత్త టెక్నాలజీతో గేమింగ్‌ను మరింత ఇమ్మర్సివ్‌గా మార్చేయబోతోంది.

Sony s New PlayStation Tech Lets Gamers Smell In-Game Environments Soon

ఈ కాన్సెప్ట్‌లో ప్లేయర్స్ ఒక ప్రత్యేక గదిలోకి వెళ్తారు. ఆ గది గోడలన్నీ హై-క్వాలిటీ ఎల్ఈడీ స్క్రీన్లతో నిండి ఉంటాయి. ఆ స్క్రీన్లపై గేమ్ వాతావరణం కనిపించడంతో, ప్లేయర్స్ తాము ఆ గేమ్ ప్రపంచంలోనే ఉన్నామనే భావన కలుగుతుంది.

అంతేకాదు, అత్యంత సహజమైన శబ్దాలు, టచ్ ఫీడ్‌బ్యాక్ (హాప్టిక్స్), వాతావరణ ప్రభావాలు, ఇంకా ప్రత్యేకమైన సువాసనలు వెదజల్లే వ్యవస్థను కూడా సోనీ ఏర్పాటు చేసింది. దీంతో ఆ గేమ్ ఆడుతున్నంతసేపు మరో ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది.

* డెమో వీడియో అదుర్స్

దీన్ని నిరూపించడానికి సోనీ "ది లాస్ట్ ఆఫ్ అస్" అనే గేమ్ డెమోను ప్రదర్శించింది. ఆ డెమోలో ప్లేయర్స్ గేమ్ ప్రపంచాన్ని చూడటమే కాకుండా, అందులోని వస్తువులతో ఇంటరాక్ట్ కూడా అయ్యారు. అంతేకాదు, ఆ గేమ్‌లోని ప్రత్యేకమైన అంశాలను వాసన చూడగలిగారు. ఉదాహరణకు, క్లిక్కర్స్ వంటి భయంకరమైన జీవులు ఎదురైనప్పుడు, ఆ గదిలో వాటికి సంబంధించిన వాసనలు వెలువడ్డాయి. వాళ్లు చూపించిన డెమోలో ఒక పెద్ద రూమ్ లోకి ప్లేయర్లు వెళ్లిపోయి మంచిగా గేమ్‌లో మొత్తం బ్యాక్ గ్రౌండ్ అంతా చూడటం జరిగింది.

ఆ వీడియో యూట్యూబ్లో షేర్ చేశారు మీరు చూడొచ్చు. జాంబీ లాంటి జీవులు కళ్ల ముందుకి వచ్చినట్లు వాటిని మనం కాల్చగానే అవి కింద పడిపోతున్నట్లు స్పష్టంగా కనిపించింది. అంటే అక్షరాల గేమింగ్ ప్రపంచంలోకి కాలు మోపినట్లే అని చెప్పొచ్చు.

ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ఈ సరికొత్త అనుభూతి కోసం ప్లేయర్లు ఎలాంటి VR హెడ్‌సెట్స్‌ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఆ ప్రత్యేకంగా రూపొందించిన గదిలోకి వెళ్తే చాలు. కానీ దీనికోసం ప్రత్యేకమైన టెక్నాలజీతో కూడిన స్థలం అవసరం అవుతుంది.

* మిక్స్డ్ రెస్పాన్స్‌లు

వాసనలను గేమింగ్‌లోకి తీసుకురావడం అనేది వినూత్నమైన ఆలోచనే అయినా, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది గేమర్స్ ఈ సరికొత్త లీనమయ్యే అనుభూతి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, మరికొందరు మాత్రం దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ టెక్నాలజీ ఎంతవరకు ఆచరణ సాధ్యమవుతుంది? ఎలాంటి వాసనలు ఉపయోగిస్తారు? ముఖ్యంగా భయానకమైన గేమ్స్‌లో దుర్వాసనలు వస్తే ఎలా? సాధారణ గేమర్లకు ఇది ఎంతవరకు అందుబాటులో ఉంటుంది? దీని ధర ఎంత ఉంటుంది? ఇలాంటి అనేక ప్రశ్నలు వారి మదిలో మెదులుతున్నాయి.

* త్వరలో వచ్చేలా లేదే..

అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్రస్తుతం కేవలం ఒక ఆలోచన మాత్రమే. ఈ టెక్నాలజీని ఇప్పటికిప్పుడే ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ఆలోచనలు ఏమీ లేవని సోనీ చెబుతోంది.

ప్రస్తుతం సోనీ కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌లో కథ చెప్పే విధానాన్ని, లీనమయ్యే అనుభూతిని మరింత మెరుగుపరచడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ వాసనల టెక్నాలజీ గేమింగ్‌లో ఒక సాధారణ భాగంగా మారుతుందా లేదా అనేది వేచి చూడాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
Sony's "Future Immersive Entertainment" concept enhances gaming by involving multiple senses, notably allowing players to smell the game environment. This immersive experience is currently just a concept.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X