త్వరలో... ఒక్క సెకనులో సినిమా మొత్తం డౌన్‌లోడ్ చేసుకుంటాం!

Posted By:

త్వరలో.. పూర్తినిడివి గల సినిమాను ఒకేఒక సెకనులో డౌన్‌లోడ్ చేసుకోగలుగుతాం. ఇది వాస్తవం!. టెక్నాలజీ విభాగంలో అగ్రగామి దేశాల సరసన నిలిచిన దక్షిణ కొరియా $1.5బిలియన్ల వ్యయ ప్రణాళికతో 5వ తరం వైర్‌లెస్ (5జీ నెట్‌వర్క్‌ను) అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పరిశోధనలు జరపుతోంది. ఈ వేగవంతమైన వైర్‌లెస్ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చినట్లయితే పూర్తినిడివి గల సినిమాలను సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

త్వరలో... ఒక్క సెకనులో సినిమా మొత్తం డౌన్‌లోడ్ చేసుకుంటాం!

ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ నెట్‌వర్క్‌లతో పోలిస్తే 5జీ 1000 రెట్లు వేగవంతంగా స్పందిస్తుందని ఆ దేశపు సైన్స్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాము వృద్ధి చేస్తున్న 5జీ సర్వీసును 2017లో ట్రెయిల్ ప్రాదిపదికన విడుదల చేస్తామని, 2020 డిసెంబర్ నాటికి కమర్షియల్‌గా అందుబాటులోకి తీసుకువస్తామని దక్షిణ కొరియా సైన్స్ వైజ్ఞానిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యూరోప్, చైనా, యూఎస్ వంటి దేశాలు 5జీ టెక్నాలజీ వృద్ధి పై ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించాయి. భారత్ వంటి దేశాల్లో 4జీ ఇంటర్నెట్ సర్వీసులు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవటం విశేషం.

టెక్నాలజీ విభాగంలో సరికొత్త సంచలనాల దిశగా దూసుకుపోతున్న సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ మరో అత్యున్నత ఆవిష్కరణ వైపు అడుగులు వేస్తోంది. 5జీ హై-స్సీడ్ ఇంటర్నెట్ సర్వీసులను చేరువ‌చేసే సరికొత్త కోర్ టెక్నాలజీని వృద్థిచేస్తున్నట్లు సామ్‌సంగ్ ప్రకటించింది. ఈ 5జీ మొబైల్ కమ్యూనికేషన్స్ సేవలు 2020 నాటికి అందుబాటులోకి రానున్నాయి.

పరీక్షల్లో భాగంగా ఈ ఆధునిక టెక్నాలజీ ఇంటర్నెట్ సర్వీస్ 1జీబీపీఎస్ వేగాన్ని అందుకున్నట్లు సామ్‌సంగ్ వెల్లడించింది. సామ్‌సంగ్ వృద్థిచేస్తున్న 5జీ మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉన్న 4జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే వందల రెట్లు వేగవంతంగా స్పందించగలదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot