భలే.. భలే మాట్లాడే చేతి గ్లౌజులు!

Posted By: Prashanth

భలే.. భలే మాట్లాడే చేతి గ్లౌజులు!

 

చేతి కదలికలను మాటల రూపంలోకి మార్చే గ్లవుజులను శాస్త్రవేత్తలు సృష్టించారు. ఇవి మాటలు రాని లక్షలాది మంది మూగవారికి ఉపయోగపడగలవని నిపుణులు భావిస్తున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఆధారంగా స్పందించే ఈ గ్లవుజులును ‘స్టెప్’ కంప్యూటర్ అకాడమీకి చెందిన పరిశోధకులు పాస్టర్ నికోవ్ అంటాన్, ఓసిక మాక్సిమ్, యసకవ్ వాలెరిటీ, స్టెపనోవ్ అంటాన్‌ల బృందం డిజైన్ చేసింది.

ఈ గ్లవుజులు ఒక జత సెన్సర్లు, ఒక యాక్సెలరోమీటర్, కంపాస్, గైరోస్కోప్, వేళ్ల వద్ద ఫ్లెక్స్ సెన్సర్ వ్యవస్థలను కలిగి ఉంటాయి. ఇవి చేతి కదలికలను సిగ్నల్స్ లా మార్చి కంప్యూటర్‌కు చేరవేస్తాయి. ఆ సిగ్నల్స్‌ను కంప్యూటర్ మాటలుగా అనువదిస్తుంది. గ్లోవ్స్ ధరించిన మనిషి చేతితో సంజ్ఞలు చేస్తే, ఆ సమాచారం బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లకు చేరుతుంది. అందులో ముందుగానే నిక్షిప్తమైన మెమరీలోని సమాచారం ఆధారంగా సంజ్ఞలకు అనుగుణమైన మాటలను వినిపిస్తుంది.

అయితే ఈ గ్లవుజులకు కొన్ని పరిమితులు లేకపోలేదు. కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసిన చేతి భంగిమలు సంకేత భాషకు సంబంధించినవి కావు. పైగా సంకేత భాష ఒకో దేశంలో ఒకో తీరుగా ఉంటుంది. అందువల్ల ఈ గ్లవుజుల్లోని వ్యవస్థ కొన్ని కదిలికలను మాత్రమే అర్ధం చేసుకోగలదరు. పైగా వీటిని ఎల్లప్పడు ధరించటం సాధ్యం కాదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot