త్వరలో భారత్ అంతటా హై-స్పీడ్ ఇంటర్నెట్ : ఇస్రో చైర్మన్ శివన్

రానున్న రోజుల్లో 100Gbps కంటే ఎక్కువ బ్యాండ్‌విడ్త్‌ కనెక్టువిటీతో కూడిన హై-స్పీడ్ ఇంటర్నెట్ భారతీయులకు అందుబాటులో ఉంటుందని అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ కే.శివన్ స్పష్టం చేసారు.

|

రానున్న రోజుల్లో 100Gbps కంటే ఎక్కువ బ్యాండ్‌విడ్త్‌ కనెక్టువిటీతో కూడిన హై-స్పీడ్ ఇంటర్నెట్ భారతీయులకు అందుబాటులో ఉంటుందని అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ కే.శివన్ స్పష్టం చేసారు. త్వరలో లాంచ్ చేయబోతోన్న మూడు GSAT శాటిలైట్స్‌తో ఇది సాకారం కాబోతోందని ఆయన తెలిపారు.

అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మరో బంపర్ ఆఫర్‌అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మరో బంపర్ ఆఫర్‌

త్వరలోనే మూడు శాటిలైట్స్ లాంచ్...

త్వరలోనే మూడు శాటిలైట్స్ లాంచ్...

ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది ఇంటర్నెట్ యూజర్లను కలిగి ఉన్న రెండవ అతిపెద్ద దేశంగా భారత్ గుర్తించుతెచ్చుకున్నప్పటికి బ్రాడ్‌బ్యాండ్ ‌స్పీడ్స్ విషయంలో మత్రం 75వ స్థానంలో కొనసాగుతోందని శివన్ తెలిపారు. దేశ కమ్యూనికేషన్ వ్యవస్థను మరింతగా బలోపేతం చేసే క్రమంలో ఇస్రో ‘జీశాట్-19' (GSAT-19) శాటిలైట్‌ను 2017లో అంతరిక్షంలోకి లాంచ్ చేసింది. ఇదే ఉద్దేశ్యంతో జీశాట్-11 (GSAT-11) , జీశాట్-29 (GSAT-29), జీశాట్-20 (GSAT-20) శాటిలైట్స్‌ను వచ్చే ఏడాది ఆరంభంలోపు ఇస్రో ప్రయోగించబోతోంది.

 

 

వాటి కోసం రూ.10,990 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది..

వాటి కోసం రూ.10,990 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది..

వీటి ప్రయోగించటం ద్వారా బ్యాండ్‌విడ్త్‌ కనెక్టువిటీని మరింత రెట్టింపు చేసి గ్రామీణ ప్రాంతాల్లో సైతం హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను చేరువరేయాలని ఇస్రో భావిస్తోంది. రానున్న నాలుగు సంవత్సరాల్లో లాంచ్ చేయబోయే 30 పీఎస్‌ఎల్‌వీ అలానే 10 జీఎస్‌ఎల్‌వీ ఎం-3 శాటిలైట్స్ నిమిత్తం ప్రభుత్వం రూ.10,990 కోట్ల బడ్జెట్‌ను అప్రూవ్ చేసిందని శివన్ తెలిపారు. గీతమ్ విశ్వవిద్యాలయ తొమ్మిదవ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఇస్రో చైర్మన్ శివన్‌డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు.

మందగిస్తోన్న 4జీ వేగం..

మందగిస్తోన్న 4జీ వేగం..

ఇండియన్ టెలికం మార్కెట్లోకి పెను సంచలనంలా దూసుకొచ్చిన 4జీ మొబైల్ నెట్‌వర్క్ ఇప్పుడు అదే స్థాయిలో బఫరింగ్ సమస్యలను ఎదుర్కుంటోంది. గత ఏడాది కాలంగా భారత్‌లో నమోదవుతోన్న సగటు 4జీ ఎల్టీఈ స్పీడ్‌ను గమనించినట్లయితే 6.1ఎంబీపీఎస్‌గా ఉంది. ఈ వేగాన్ని గ్లోబల్ యావరేజ్ స్పీడ్ అయిన 17 ఎంబీపీఎస్‌తో కంపేర్ చేసి చూసినట్లయితే ఇంచుమించుగా మూడు రెట్లు తక్కువుగా ఉంది. 5జీ లాంచ్‌కు సమయం సమీపిస్తున్నప్పటికి పరిస్థితిలో ఏ విధమైన మార్పు రాకపోవటమనేది కొంత కలవరపాటుకు గురిచేస్తోంది.

 

 

100 ఎంబీపీఎస్ వేగంతో జియో బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌

100 ఎంబీపీఎస్ వేగంతో జియో బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌

ప్రస్తుత మార్కెట్‌ను మనం పరిశీలించినట్లయితే జియో, ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ వంటి సంస్థలు పోటాపోటీగా 4జీ నెట్‌వర్క్‌ను ఆఫర్ చేస్తన్నాయి. మరోవైపు 5జీ నెట్‌‍వర్క్ పైనా విస్తృత చర్చలు జరుపుతున్నాయి. ఈ రేసులో కొంచం ముందు నడుస్తోన్న జియో తన ఫైబర్ ఆధారిత హోమ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను త్వరలో 100 ఎంబీపీఎస్ వేగంతో అందించగలుగుతామని చెబుతోంది.

 

 

భారత్‌లో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లకు...

భారత్‌లో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లకు...

భారత్‌లో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లకు సంబంధించిన యూకేకు చెందిన ప్రముఖ స్పీడ్ టెస్టర్ ఓపెన్‌సిగ్నల్ పలు ఆసక్తకిర వివరాలను వెల్లడించింది. పొరుగు దేశాలైన శ్రీలంక (13.95 ఎంబీపీఎస్, పాకిస్తాన్ (13.56ఎంబీపీఎస్), మయన్మార్ (15.56 ఎంబీపీఎస్)లతో పోలిస్తే చాలా తక్కువుగా ఉంది. డెవలపుడ్ మార్కెట్స్ అయిన యూఎస్, యూకే ఇంకా జపాన్‌లలో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్స్ 16.31ఎంబీపీఎస్, 23.11ఎంబీపీఎస్, 25.39ఎంబీపీఎస్‍‌లుగా ఉన్నాయి.

 

 

భారత్‌కు 109వ ర్యాంక్..

భారత్‌కు 109వ ర్యాంక్..

యూఎస్ డేటా టెస్టర్ ఓక్లా రివీల్ చేసిన వివరాల ప్రకారం ఓవరాల్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్స్ ర్యాంకింగ్స్‌లో భారత్ 9.12 ఎంబీపీఎస్ యావరేజ్ డౌన్‌లోడ్ స్పీడుతో 109వ ర్యాంకుకు పడిపోయింది. ఇది గ్లోబల్ యావరేజ్ అయిన 23.54 ఎంబీపీఎస్‌తో పోలిస్తే చాలా తక్కువు. ఈ లిస్టులో మొత్తం 124 దేశాలకు చెందిన ఇంటర్నెట్ స్పీడ్‌లను పొందుపరిచారు.

Best Mobiles in India

English summary
Soon, India to enjoy more than 100 Gbps internet speed: Isro.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X