రద్దు అయిన రైళ్ల రిఫండ్ ప్రక్రియపై కీలక ప్రకటన చేసిన దక్షిణ మధ్య రైల్వే..!
భారతీయ రైల్వే ఇటీవల కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం రైల్వేలో మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తోంది. హైస్పీడ్ రైల్ కనెక్టివిటీని పెంచుతోంది. రైళ్లలో శుభ్రత కోసం చర్యలు చేపడుతోంది. మరియు ప్రయాణికుల ఫిర్యాదులపై తక్షణం చర్యలు తీసుకుంటోంది. ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో భారతీయ రైల్వే (Indian Railway) ఒకటిగా ఉంది. ప్రతిరోజు కోట్లాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తోంది.
రైల్వేలో టికెట్ క్యాన్సిలేషన్, రిఫండ్ రూల్స్ (Railway Refund Rules) కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంది. గతంలో రిఫండ్ పొందేందుకు ఎక్కువ రోజుల ఎదురుచూడాల్సి వచ్చేంది. అయితే ఇటీవల రిఫండ్ ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే తాజాగా రైల్వే కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.

కొన్ని సందర్భాల్లో రైళ్లను క్యాన్సిల్ చేస్తుంటారు. అయితే ఆ రైళ్లలో టికెట్లు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు వేగంగా రిఫండ్ పొందేలా ప్రస్తుతం కీలక ప్రకటన చేసింది. క్యాన్సిల్ అయిన రైలు టెకెట్ల నగదు రిఫండ్ పొందేందుకు మూడు రోజుల్లోగా ఆయా టికెట్లను మీకు సమీపంలోని రైల్వే టికెట్ కౌంటర్‌ల వద్ద సమర్పించాలని సూచించింది.
ప్రయాణం తేదీ నుంచి మూడు రోజుల్లోగా ఈ టికెట్లను సమర్పించాలని సూచించింది. ఫలితంగా వెంటనే నగదు తీసుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. రైళ్లు రద్దు చేసిన సమయాల్లో ఆన్‌లైన్ టికెట్లు ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ కానున్నాయని.. రిఫండ్ ప్రక్రియ కూడా ఆటోమేటిక్‌గా ప్రారంభం కానుందని తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే (SCR) ఈ మేరకు ప్రకటన చేసింది.
భారీ వర్షాలు, వరదలు, ప్రమాదాలు, నిరసనలు, శాంత్రి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు రైళ్లను పాక్షకంగా మరియు పూర్తిగా క్యాన్సిల్ చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఆ రైళ్లలో టికెట్లు బుకింగ్ చేసుకున్న వారికి పైన తెలిపిన నిబంధనలు వర్తిస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.
ఏదైనా సందర్భంలో క్యాన్సిల్ చేసిన రైళ్ల సమాచారాన్ని వివిధ మీడియా ప్లాట్‌ఫామ్స్, సోషల్ మీడియా ద్వారా రైల్వే తెలియజేస్తోంది. దీంతోపాటు టికెట్ బుకింగ్ సమయంలో అందించిన ఫోన్ నంబర్‌లకు సమాచారం అందిస్తోంది.
ప్రస్తుతం రైళ్లలో వివిధ అవసరాల కోసం అనేక యాప్స్, వైబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయి. రైల్వే ప్రయాణికులు ఆయా అవసరాల కోసం అన్నింటినీ వినియోగించాల్సి వస్తోంది. అన్ని సర్వీసులను ఒకే ప్లాట్‌ఫాం మీదకు తీసుకొచ్చేందుకు వీలుగా స్వరైల్ (SwaRail) యాప్‌ను రైల్వే లాంచ్ చేసింది. గత నెలలో ఈ యాప్ బీటా వెర్షన్‌ను లాంచ్ చేసింది.
త్వరలో పూర్తి స్థాయిలో ప్రయాణికులు అందరికీ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్ కోసం IRCTC యాప్, వెబ్‌సైట్ అందుబాటులో ఉన్నాయి. అన్ రిజర్వడ్ టికెట్లు, ప్లాట్‌ఫాం టికెట్ల కోసం UTS యాప్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.
గత సంవత్సరం చివరలో రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైనా రైలులో గరిష్ఠంగా 120 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉండేది. గత సంవత్సరం నవంబర్ నుంచి ఈ విధానంలో మార్పులు చేసింది. రైలు ప్రారంభం అయ్యే తేదీ కంటే ముందు కేవలం 60 రోజులు ముందుగానే ప్రస్తుతం టికెట్లు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








