ప్రయివేట్ డేటాని సేకరిస్తుందనే నెపంతో గూగుల్‌పై సౌత్ కోరియా పోలీస్ రైడ్

Posted By: Staff

ప్రయివేట్ డేటాని సేకరిస్తుందనే నెపంతో గూగుల్‌పై సౌత్ కోరియా పోలీస్ రైడ్

సియోల్: గ్లోబల్ సెర్చింగ్ కంపెనీ అయినటువంటి గూగుల్ మొబైల్ ఫోన్ ఎడ్వర్టైజింగ్ ప్లాట్ ఫామ్‌ని ఉపయోగించి కొంత ప్రయివేట్ డేటాని సేకరిస్తుందనే నెపంతో గూగుల్ లోకల్ ఆఫీస్‌పై సౌత్ కొరియా పోలీసులు మంగళవారం రైడ్ చేయడం జరిగింది. సియోల్‌లో ఉన్నటువంటి గూగుల్ లోకల్ ఆఫీస్‌కి ఇన్విస్టిగేటర్స్ వెళ్శి అక్కడున్న యాడ్ మాబ్ ప్లాట్ ఫామ్‌కి సంబంధించిన హార్డ్ డ్రైవ్‌లు, కంప్యూటర్లు చెక్ చేయడం జరిగిందని సైబర్ క్రైమ్ యూనిట్‌కి చెందిన పోలీస్ చెప్పడం జరిగింది. ఈ రైడ్ తర్వాత తను చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తుంటే గూగుల్ మొబైల్ ఎడ్వర్టైజింగ్ ఏజెన్సీ యాడ్ మాబ్ ఇల్లీగల్‌గా సౌత్ కోరియా దేశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తుందని తెలిపారు.

దాంతో దీనిపై స్పందించమని గూగుల్ అఫీసియల్స్‌ని అడగగా వారు దీనిపై స్పందించడానికి నిరాకరించారు. జనవరిలో పోలీస్ విచారణలో తేలిన దాని సమాచారం ప్రకారం గూగుల్ కంపెనీ పర్సనల్ డేటాని ముఖ్యంగా స్ట్రీట్ మ్యాపింగ్ సర్వీస్‌ని అందరికి అందుబాటులో ఉండే విధంగా గూగుల్ మ్యాప్స్ సైట్‌లో ఉంచడం, అంతేకాకుండా పనోరమిక్ వీదికి సంబంధించిన సీన్లుకూడా ఇందులో పోందుపరచడం తెలిసి ఇలా రైడ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

ఇలా గూగుల్ స్ట్రీట్ వివ్ కార్స్ పేరుతో దాదాపు ప్రపంచం మొత్తం మీద 30 దేశాలలో ఫోటోగ్రాప్స్ తీయడమే కాకుండా, వైపై సిస్టమ్స్ ఉపయోగించి పర్సనల్ డేటాని కూడా ట్రాక్ చేస్తుందని సమాచారం. ఐతే మేము సౌత్ కొరియాలో చేస్తున్నటువంటి ఈ స్ట్రీట్ మ్యాపింగ్ సర్వీస్‌కి ప్రతి రాష్ట్రం వారు కూడా మా వద్ద నుండి ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారని వాపోయారు. ఇది మాత్రమే కాకుండా సౌత్ కొరియా టెలికమ్ రెగ్యులేటరీ వారు ఆపిల్ కంపెనీ వస్తువులు అయినటువంటి ఐఫోన్, ఐప్యాడ్‌ల మీద కూడా ఎంక్వయిరీ వేశారు. ఎవరైతే సౌత్ కొరియాలో యుయస్‌కు సంబంధించిన కలెక్షన్స్ వాడుతున్నారో వారందరూ ప్రైవసీ రూల్స్‌ని సరిగ్గా పాటిస్తున్నారో లేదో చూడాలని ఆదేశించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot