స్కూల్స్‌లో బుక్స్‌కి బదులు డిజిటల్ బుక్స్(టాబ్లెట్స్)

Posted By: Staff

స్కూల్స్‌లో బుక్స్‌కి బదులు డిజిటల్ బుక్స్(టాబ్లెట్స్)

2015వ సంవత్సరం కల్లా సౌత్ కొరియా పాఠశాలలో స్కూలు విద్యార్దులు టెక్ట్స్ బుక్స్‌కి బదులు డిజిటల్ టెక్ట్స్ బుక్స్(టాబ్లెట్స్) చేతపట్టుకొని స్కూలుకి రావడం జరుగుతుందని సౌత్ కొరియా మినిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్(సైన్స్ అండ్ టెక్నాలజీ) విభాగం వారు వెల్లడించడం జరిగింది. క్లౌడ్ టెక్నాలజీని ఉపయోగాన్ని ఆసరాగా తీసుకొని 2.2 ట్రిలియన్(US $2 billion) ఖర్చుపెట్టి టెక్ట్స్ బుక్స్‌ని డిజిటల్ లింక్స్‌గా మార్చబోతున్నామని తెలిపారు. వేరు వేరు మల్టీమీడియా కంటెంట్‌ని సర్వర్స్‌కి అందజేసి వై-పై నెట్ వర్క్‌కి స్కూల్స్‌కి అనుసంధానం చేసి తక్కువ ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించి పిల్లలకు టాబ్లెట్స్ అందించనున్నామని ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలియజేశారు.

ఇక టాబ్లెట్స్‌ని కొనుగోలు చేయడానికిగాను గవర్నమెంట్ సౌత్ కొరియా ఎలక్ట్రానిక్స్ గెయింట్ శ్యామ్‌సంగ్‌, అమెరికాకు చెందిన ఆపిల్ కంపెనీ సంప్రదించడం జరిగిందన్నారు. సౌత్ కొరియాలో ఉన్నటువంటి కొన్ని స్కూల్స్ ఈ పద్దతిని అవలంభించడం జరగుతుందన్నారు. త్వరలోనే దీనిని మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంలో గవర్నమెంట్ ప్రతినిధి మాట్లాడుతూ టెక్ట్స్ బుక్స్‌ని డిజిటల్ టెక్ట్స్ బుక్స్‌ రూపంలోకి మార్చడం అనేది మేము పెద్ద కష్టంగా భావించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచం ఎంతో ముందుకు సాగిపోతుండడంతో మేము ఈ నిర్ణయం తీసుకొవడం జరిగిందని తెలిపారు.

ఇలా చేయడం వల్ల విద్యార్దులకు చాలా సాయంగా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా డిజిటల్ బుక్స్ వల్ల ఎవరికి వారు సొంతంగా తెలివితేటలను ఉపయోగించి ఆన్ లైన్‌లో పాఠాలు తెలుసుకొవడమే కాకుండా, దానికి సంబంధించిన పూర్తి సారాంశాలను ఆన్‌లైన్‌లో తెలుసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. కొంత మంది ఎప్పుడైనా క్లాసులను మిస్ అయితే వారు ఆన్ లైన్ క్లాసుల ద్వారా వాటిని తెలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో టెక్నాలజీ, ఇంటర్నెట్ రెండు కూడా బాగా ప్రభావితం చేసే అంశాలు. ఇది ఇలా ఉంటే ప్రపంచం మొత్తం మీద బుక్స్‌ని డిజిటల్ బుక్స్‌గా మార్చాలని నిర్ణయం తీసుకున్న గవర్నమెంట్ సౌత్ కొరియా గవర్నమెంట్ కావడం విశేషం.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot