ఆకాశం నుంచి టమోటాలు, పూలు..

Written By:

అంతరిక్షంలో పంటలు పండిస్తున్నారంటే ఇప్పుడూ ఆశ్చర్యపోవడం ఖాయమే. కానీ ఇది నిజం. ఇన్నాళ్లు పొలంలో పంటలుపండించి సేద్యం చేసిన మానవుడు ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలో సేద్యానికి ఆజ్యం పోసినాడని తెలిస్తే మీరే కాదు.. ఎవరైనా ఆశ్చర్యచకితులు కావాల్సిందే! అందులోనూ అది పూలసాగు. పూలసాగు భూమ్మీద ఉంటే ఆ భూమికే ఎంతో అందాన్నిస్తుంది. మరి అంతరిక్షంలోనూ తన అందాల పరిమళాల్ని అలాగే టమోటాల్ని విస్తరింపజేసేందుకు సిద్ధమైందన్నమాట. వివరాల్లోకి వెళితే..

Read more: అంతరిక్షంలో పండించిన పాలకూర టేస్ట్ అదుర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ స్ఫూర్తితోనే వెజ్జీ పేరిట ఒక గ్రోత్ సిస్టమ్‌ను స్పేస్ స్టేషన్‌లో

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్)లో శాస్త్రవేత్తలు పూల పెంపకాన్ని చేపట్టారు. రెడ్ రొమైన్ లెట్యూస్ అనే కూరగాయలను శాస్త్రవేత్తలు అంతరిక్షంలో విజయవంతంగా పండించారు. ఈ స్ఫూర్తితోనే వెజ్జీ పేరిట ఒక గ్రోత్ సిస్టమ్‌ను స్పేస్ స్టేషన్‌లో యాక్టివేట్ చేసి పలు జినియా విత్తనాలను నాటారు.

మొట్ట మొదటిసారిగా ఒక పువ్వు పెంపకాన్ని చేపట్టామని

ఇవి పొద్దు తిరుగుడు పువ్వులను పోలి ఉంటాయి. లెట్యూస్ తరువాత తాము మొట్ట మొదటిసారిగా ఒక పువ్వు పెంపకాన్ని చేపట్టామని ఆ స్టేషన్ సైంటిస్టులు తెలిపారు. అయితే కూరగాయల కంటే పువ్వులను అంతరిక్షంలో పండించడమే అతి పెద్ద సవాల్‌గా మారిందని వారు తెలిపారు.

సూర్యకాంతి వంటి పర్యావరణ అంశాలు ఈ పువ్వుల ఎదుగుదలను

సూర్యకాంతి వంటి పర్యావరణ అంశాలు ఈ పువ్వుల ఎదుగుదలను ప్రభావితం చేస్తాయని తెలిపారు. కాంతి కోసం లిండ్‌గ్రెన్ అనే లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఇది ఎరుపు, నీలి, ఆకుపచ్చ రంగులతో కూడిన ఎల్‌ఈడీ బల్బుల కాంతిని సదరు పువ్వు విత్తనాలపై ప్రసారం చేస్తుందని తెలిపారు.

రోజుకి 10 నుంచి 14 గంటల పాటు ఈ కాంతిని సదరు విత్తనాలపై

రోజుకి 10 నుంచి 14 గంటల పాటు ఈ కాంతిని సదరు విత్తనాలపై పడేలా ఏర్పాటు చేశామని అన్నారు. 2017 కల్లా టమాటా మొక్కలను అంతరిక్షంలో పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందు కోసం నాసా ఆస్ట్రోనాట్ స్కాట్ కెల్లీతోపాటు మరో 44 మంది శాస్త్రవేత్తలు బృందంగా ఏర్పడి నిర్విరామంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

జిన్నియా మొక్కలు పెంచడం ద్వారా అంతరిక్షంలో

జిన్నియా మొక్కలు పెంచడం ద్వారా అంతరిక్షంలో మొక్కలు పెంచవచ్చనే అంశంపై మరింత అవగాహన ఏర్పడుతుందని, దాని ద్వారా శాస్త్రవేత్తలకు ఆహారం అందించేందుకు టమాటా పంటపై దృష్టి పెడుతామని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

పూలను పండించడమే సవాల్‌తో కూడుకున్న పని

పాలకూర లాంటి శాఖాహార మొక్కల కంటే పూలను పండించడమే సవాల్‌తో కూడుకున్న పని అని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌కు చెందిన జియెయా మాస్సా తెలిపారు. మొక్కల పెంపకం కోసం లైటింగ్, ఇతర వాతావరణ పరిస్థితులను కల్పించడం చాలా క్లిష్టమైనదని ఆమె పేర్కొన్నారు. అమెమెడిసిన్‌లోని ఆర్బిటాల్ టెక్నాలజీస్ కార్పొరేషన్ (ఆర్బిటెక్)లో వెజ్జీ సిస్టంను నాసా అభివృద్ధి చేసింది.

వ్యోమగాములు తొలిసారి పాలకూర రుచి

మొన్నా మధ్య అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు తొలిసారి పాలకూర రుచి చూశారు. నాసా వ్యోమగామి స్కాట్ కెల్లీ తో పాటు ఎక్స్ పెడిషన్ 44 మంది వ్యోమగాములు వెజ్జీ ప్లాంట్ గ్రోత్ సిస్టమ్ ద్వారా పండించిన ఈ పాలకూరను వ్యోమగాములు తిన్నారని నాసా వెల్లడించింన విషయం విదితమే.

అయితే వారు సగం పాలకూరను తినగా మిగతా సగాన్ని

అయితే వారు సగం పాలకూరను తినగా మిగతా సగాన్ని పరిశోధనల నిమత్తం భూమికి తిరిగి వచ్చేంతవరకూ అలాగే భద్రపరుస్తారని నాసా తెలిపింది. భవిష్యత్ లో అనేక అవసరాల నిమిత్తం అలాగే సుదీర్ఘ యాత్రలు చేస్తున్న వ్యోమగాముల ఆహారం అవసరాల కోసం నాసా వెజ్జీ ఫ్లాంట్ గ్రోత్ సిస్టమ్ ని డెవలప్ చేస్తోంది.అందులో భాగంగా ఈ పూల సాగును కూడా చేస్తోన్నట్లు నాసా వెల్లడించింది.

జిన్నియా మొక్కలు పంపకం సఫలమైతే

అంతరిక్షంలో జిన్నియా మొక్కలు పంపకం సఫలమైతే.. పూల మొక్కలు పెంచడానికి కూడా మార్గం సుగమమవుతుందనే భావనతో నాసా శాస్త్రవేత్తలు ప్రయోగాలను వేగవంతం చేస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write Space Grown Flowers Will be New Year Blooms on International Space Station
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot