స్పెషల్ రెడ్ వేరియంట్‌‌లో Mi A1

Posted By: BOMMU SIVANJANEYULU

చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ షావోమి (Xiaomi) తన ఎంఐ ఏ1 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి స్పెషల్ ఎడిషన్ రెడ్ కలర్ వేరియంట్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ ధర రూ.13,999. డిసెంబర్ 20 నుంచి Mi.com అలానే Flipkartలో సేల్ ప్రారంభమవుతుంది. ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది.

స్పెషల్ రెడ్ వేరియంట్‌‌లో Mi A1

షావోమి బ్రాండ్ నుంచి లాంచ్ అయిన మొట్టమొదటి ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌గా Mi A1 గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. "created by Xiaomi and powered by Google" అనే ట్యాగ్‌లైన్‌తో లాంచ్ అయిన Mi A1కు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ ప్రధాన హైలైట్‌గా చెప్పుకోవచ్చు.

గూగుల్ లాంచ్ చేసే ప్రతి ఆండ్రాయిడ్ అప్‌డేట్ రెండేళ్ల పాటు ఈ ఫోన్‌కు లభిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్నప్పటికి త్వరలోనే Android 8.0 Oreo అప్‌డేట్‌ను అందుకోబోతుంది.

Xiaomi Mi A1 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు Android Oreo), 2.0GHz ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ (వైడ్ యాంగిల్ సెన్సార్) + 12 మెగా పిక్సల్ (టెలీ ఫోటో లెన్స్) రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్, వై-ఫై, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 3080 mAh హై-కెపాసిటీ బ్యాటరీ, అన్‌లిమిటెడ్ గూగుల్ ఫోటో స్టోరేజ్, మెటల్ యునిబాడీ డిజైన్ విత్ రౌండెడ్ ఎడ్జెస్.

ఉత్తర కొరియాపై నిప్పులు చెరిగిన అమెరికా, ఆ దాడి కిమ్ పనే !

రూ.13,999 ధర ట్యాగ్‌లో Mi A1ను బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా చెప్పుకోవచ్చు. ఫోన్ డిజైనింగ్ దగ్గర నుంచి అంతర్గత విభాగాల పనితీరు వరకుస అన్ని అంశాలు ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. stock Android ఎక్స్‌పీరియన్స్ Mi A1కు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది.

ఈ ఫోన్‌కు సంబంధించి బ్యాటరీ లైఫ్ అలానే లో-లైట్ ఫోటోగ్రఫీ విభాగాల పై షావోమీ మరింత ఫోకస్ చేసి ఉంటే బాగుండేది. Mi A1 ఫోన్‌లను Flipkart, Mi.comలతో పాటు Mi Home స్టోర్‌లలో విక్రయిస్తున్నారు.

English summary
Xiaomi MiA1 runs stock Android and sports a dual-lens camera setup. It offers 4GB RAM + 64GB internal storage and a 5.5-inch 2.5D curved glass screen.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot