గట్టిగా వాగితే నోరు నొక్కుడే!!

Posted By: Prashanth

గట్టిగా వాగితే నోరు నొక్కుడే!!

 

లండన్: కనీస ఇంగితజ్ఞానం లేకుండా ఇతరలకు ఇబ్బంది కలిగిస్తూ పలువురు బిగ్గరగా మాట్లాడేలస్తుంటారు. ప్రదేశం ఏదైనా.. సందర్భం ఏలాంటిదైనా వీరి ప్రవర్తనలో మాత్రం తేడా ఉండదు. ఈ విధంగా శబ్ధకాలుష్యాన్ని స్ళష్టించే వాగుడుకాయల నోరు నొక్కేందుకు జపాన్ శాస్త్రవేత్తలు ‘స్పీచ్ జామింగ్ గన్’ అనే పరికరాన్ని రూపొందించారు. మనస్తత్వ శాస్త్రంలోని ఓ సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకుని ఈ పరికరాన్ని డిజైన్ చేసినట్లు రూపకర్తలు కజుటక కురిహార, కొజి సుకడా వెల్లడించారు. చేతిలో ఇమిడిపోయే ఈ డివైజ్ లో ఒక మైక్రోఫోన్, స్పీకర్, రిమోట్ వంటి భాగాలుంటాయి. గట్టిగా మాట్లాడుతున్న, లేదా ప్రసంగిస్తున్న ఓ వ్యక్తి ఉన్న దిశగా జామర్‌లోని మైక్రోఫోన్ ఉండేలా చూసి రిమోట్ నొక్కితే చాలు. మైక్రోఫోన్ వెంటనే అతడి మాటలను రికార్డు చేసేస్తుంది. తర్వాత జామర్‌లోని స్పీకర్ 0.2 సెకన్ల వ్యవధిలోనే అతడి మాటలను తిరిగి అతడికే వినిపించేలా చేస్తుంది. ఇంకేం.. తన మాటలు తనకే వినిపిస్తుండటంతో వక్త నోరెళ్లబెట్టేస్తాడన్నమాట.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot