ఆండ్రాయిడ్ ల్యాండ్‌స్టోర్‌లను ప్రారంభించిన స్పైస్ మొబిలిటీ

Posted By:

మొబైల్ టెక్నాలజీ రిటైలర్ స్పైస్ మొబిలిటీ బుధవారం తన మొదటి రెండు ఆండ్రాయిడ్ ల్యాండ్ స్టోర్‌లను ఇండియాలో ప్రారంభించింది. ఈ రెండు రిటైల్ స్టోర్‌లలో ఒకటి బెంగుళూరులోని కోరమంగళాలో రెండవ స్టోర్‌ను గ్రేట్ ఇండియా ప్లేస్ మాల్ నోయిడాలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ల్యాండ్ స్టోర్‌లలో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లతో పాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ప్రదర్శనకు ఉంచుతారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ ల్యాండ్‌స్టోర్‌లను ప్రారంభించిన స్పైస్ మొబిలిటీ

ఈ సందర్భంగా స్పైస్ గ్లోబల్ సహ-వ్యవస్థాపకులు ఇంకా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దిలీప్ మోడీ స్పందిస్తూ భారత్ మార్కెట్లో మొట్టమొదటి ఆండ్రాయిడ్ ల్యాండ్‌స్టోర్ ప్రారంభించటం ఆనందంగా ఉందని, ఈ తరహా స్టోర్లు ఆండ్రాయిడ్ యూజర్లకు మరింతగా ఉపయోగపడతాయని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా భారత్‌లో ఆండ్రాయిడ్ ఆధారిత డివైజ్‌లకు విపరీతమైన సేల్స్ ఉందని ఈ అమ్మకపు శాతాన్ని మరింత పెంచేందుకు ఆండ్రాయిడ్ ల్యాండ్ స్టోర్లు దోహదపడతాయని మోడీ అన్నారు. ఆండ్రాయిడ్ ల్యాండ్‌స్టోర్ ప్రత్యేకతలు...

ఫన్ అండ్ ఓపెన్ డిజైన్:

ఈ ఆండ్రాయిడ్ ల్యాండ్‌స్టోర్లు వినియోగదారులకు సరికొత్త అనుభూతులతో స్వాగతం పలుకుతాయి. ఇక్కడ కస్టమర్లు ఆండ్రాయిడ్ రోబోట్‌లతో మమేకమై వాటితో సరదాగా గడపవచ్చు.

ఆండ్రాయిడ్ డివైజ్‌ల ప్రదర్శన:

ఈ ల్యాండ్‌స్టోర్‌లలో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లతో పాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ప్రదర్శనకు ఉంచుతారు.

గూగుల్ ప్లే జోన్:

గూగుల్ ప్లేలోని ప్రముఖ అప్లికేషన్స్ ఇంకా గేమ్‌లను ఈ స్టోర్‌లో ప్రదర్శనకు ఉంచుతారు. ఆండ్రాయిడ్ యూజర్లు వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అత్యుత్తమ కస్టమర్ సర్వీస్:

ఆండ్రాయిడ్ ల్యాండ్ స్టోర్ల‌లోని స్టాఫ్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ పట్ల పూర్తి విజ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఆండ్రాయిడ్ యూజర్లు వీరిని సంప్రదించి సలహాలను తీసుకోవచ్చు.

ఉచిత వై-ఫై:

ఆండ్రాయిడ్ ల్యాండ్‌స్టోర్ల‌లో ఉచిత వై-పై వ్యవస్థను ఏర్పాటు చేసారు. స్టోర్ ప్రాంగణంలో ఇంటర్నెట్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot