రికార్డులు ఖాయం!

Posted By: Super

రికార్డులు ఖాయం!

దేశ వ్యాప్తంగా వేడి పుట్టిస్తున్న బ్రాండ్ స్పైస్ మొబైల్స్ మరో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఆండ్రాయిడ్ ఆధునిక వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్’ ఆధారితంగా పనిచేసే హ్యాండ్‌సెట్‌లను ప్రవేశపెట్టేందుకు స్పైస్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఐదు వేరియంట్‌లలో ఈ ఫోన్‌లు విడుదల కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ తాజా చర్యతో, స్పైస్ ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఫోన్‌లను ప్రవేశపెట్టిన తొలి బ్రాండ్‌గా రికార్డులకెక్కుతుంది.

దేశీయ బ్రాండ్ అయిన స్పైస్ డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లతో పాట 3జీ ఆధారిత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టడంలో ఆరంభం నుంచి క్రీయాశీలక పాత్ర పోషిస్తుంది. ప్రముఖ బ్రాండ్‌లైన సామ్‌సంగ్ , సోనీ, హెచ్‌టీసీలు ఇప్పటికే ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆధారిత ఫోన్‌లను మార్కెట్లో లాంఛ్ చేశాయి. ఈ నేపధ్యంలో స్పైస్ లాంచ్ చెయ్యబోతున్న ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఫోన్‌ల పై అంచనాలు ఊపందుకున్నాయి. విడుదల కానున్న ఫోన్ల ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

స్పైస్ ఎమ్5565 :

స్పైస్ (Spice)ఇటీవల సరికొత్త టచ్‌స్ర్కీన్ మొబైల్ ఎమ్5565ను మార్కెట్లో లాంఛ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేసిన ప్రతి ఫీచర్ ఔరా అనిపిస్తుంది భారతీయ వినియోగదారులకు ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. ధర రూ.2,500.

స్పైస్ ఎమ్5565 ప్రధాన ఫీచర్లు:

2.8 అంగుళాల టచ్‌స్ర్కీన్, డ్యూయల్ సిమ్, 0.3 మెగా పిక్సల్ కెమెరా, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, 8జీబి ఎక్సటర్నల్ మెమెరీ, నెట్‌వర్క్ సపోర్ట్ జీఎస్ఎమ్ (2జీ), జీపీఆర్ఎస్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, బ్యాటరీ స్టాండ్ బై 500 గంటలు. సాధారణ కర్వ్ డిజైన్‌లో రూపుదిద్దుకున్న ఈ డ్యూయల్ సిమ్ కమ్యూనికేషన్ డివైజ్ ముందు భాగంలో రెండె కాల్ బటన్‌లు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన టచ్ వ్యవస్థ సౌకర్యవంతంగా స్పందిస్తుంది. డివైజ్‌లో దోహదం చేసిన ఆడియో, వీడియో ప్లేయర్లు క్లారిటీతో కూడిన వినోదాన్ని అందిస్తాయి. బ్లూటూత్ సాయంతో ఫైళ్లను సులువుగా షేర్ చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot