టైట్ సెక్యూరటీ!

Posted By: Super

టైట్ సెక్యూరటీ!

 

దేశీ బ్రాండ్ స్పైస్, పూర్తిస్థాయి సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందకు కసరత్తులు చేస్తుంది. మూడు మోడళ్లలో ఈ హ్యాండ్‌సెట్లు విడుదల కానున్నాయి. యాంటీ - తెఫ్ట్, యాంటీ వైరస్ వంటి సమర్థవంతమైన సెక్యూరిటీ ఫీచర్లను ఈ డివైజుల్లో లోడ్ చేస్తున్నట్లు కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతానిక ఈ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి. త్వరలో ఈ వోఎస్‌ను ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్‌డేట్ చేయునున్నారు.

ఇన్‌బుల్ట్ చేసిన యాంటీ‌తెఫ్ట్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ ఫోన్‌లోని డేటాకు, వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. మరో ఫీచర్ ‘యాంటీ వైరస్’నిర్థేశించిన సమయం ప్రకారం డివైజ్‌ను స్కాన్ చేసేస్తుంది. అంతేకాదు, మీకు నచ్చిన ఫోటోలు, వీడియోలు, సందేశాలను ఇతరులు చూడకుండా లాక్ చేసుకోవచ్చు. సుసంపన్నమైన ఫీచర్లతో సమర్ధవంతమైన రూపుదిద్దుకున్న ఈ ఫోన్‌లను మరో రెండు వారల్లో విడుదల చేసే అవకాశముంది.

స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌ను మరింత విస్తరించే క్రమంలో ఐదు సరికొత్త ఆండ్రాయిడ్ ఐసీఎస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు స్పైస్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. లైవ్ టీవీ సౌలభ్యతతో రూపుదిద్దుకున్న FLO TV M 5600 ఫోన్‌ను స్పైస్ ఇప్పటికే లాంచ్ చేసింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot