గూగుల్‌లో ఉద్యోగం ఓ వరం!

Posted By: Staff

 గూగుల్‌లో ఉద్యోగం ఓ వరం!

సాఫ్టే‌వేర్ ఉద్యోగులకు బెస్ట్ ఆప్షన్‌గా పేర్కొనబడే గూగుల్... అమెరికాలోని తమ సిబ్బందికి మరో బృహత్తర పథకాన్ని ప్రకటించింది. ఇక పై సంస్థ ఉద్యోగుల్లో ఎవరైనా మరణిస్తే వారి సంవత్సర వేతనాన్ని ఏటా ఒకేసారి ఆ వ్యక్తి జీవితభాగస్వామికి చెల్లిస్తారు. పదేళ్ల పాటు ఈ విధంగా ఇస్తారు. అంతేకాకుండా సంస్థల్లో ఉద్యోగి పిల్లలకు 19 ఏళ్లు వచ్చే వరకూ ప్రతినెలా వెయ్యిడాలర్లు (దాదాపు రూ.55వేలు) అందజేస్తారు. ఆ పిల్లలు విద్యార్థులైతే 23 ఏళ్లకు వరకు స్కీమ్ వర్తిస్తుంది.

ఈ పథకాన్ని ప్రస్తుతం అమెరికాలోని గూగుల్ కార్యాలయంలో అమలుచేస్తున్నారు. త్వరలో భారత్‌లో కూడా ప్రవేశపెడతామని ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఇప్పటికే గూగుల్ కార్యాలయాల్లో సిబ్బందికి లాండ్రీ, డ్రైక్లీనింగ్, వాహన సేవలు, స్విమ్మింగ్, మసాజ్, భోజనం వైద్యంద తదితర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే ఉద్యోగుల పని పరిస్థితులకు సంబంధించిన సర్వేల్లో గూగుల్ తరచూ అగ్రస్థానంలో నిలుస్తోంది. మనదేశంలో వరసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని ఈ సెర్చ్ ఇంజన్ జెయింట్ కైవసం చేసుకుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot