స్పై టెక్నాలజీ మేళవింపుతో కమల్ 'విశ్వరూపం'

Posted By: Prashanth

స్పై టెక్నాలజీ మేళవింపుతో కమల్ 'విశ్వరూపం'

 

ఆధునిక టెక్నాలజీ మేళవింపుతో విలక్షణ నటుడు కమల్ హాసన్ అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కించిన సినిమా ‘విశ్వరూపం’. ఉగ్రవాదం నేపధ్యంలో సాగే ఈ స్పై థ్రిల్లర్‌లో అధునాత స్పై టెక్నాలజీని ఉపయోగించారు. కొత్త తరహా స్ర్కీన్‌ప్లే ఇంకా అదరగొట్టే ట్రెయిలర్‌లు సినిమా పై భారీ అంచనాలు రేకెత్తిస్తున్నాయి. యూఎస్ ఇంకా కెనడా ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని జనవరి 25న తెలుగు ఇంకా తమిళ వర్షన్‌లలో విడుదల చేసేందుకు రంగం సిద్ధమైనట్లు ఓ అధికారిక ప్రకటన వెలువడింది. 24న ప్రీమియర్ షోలు నిర్వహించనున్నారు.

టెక్నాలజీ నగరాలు (వరల్డ్ వైడ్)

ఉత్తర అమెరికా ప్రాంతంలో తెలుగు ఇంకా తమిళ వర్ష‌‍న్‌లను కలుపుకుని 110 స్ర్కీన్‌ల పై విశ్వరూపం చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఈ పత్రికా ప్రకటన సారాంశం. ఇందకు సంబంధించిన డిజిటల్ డ్రైవ్‌లను ఇప్పటికే ఆయా థియేటర్లకు తరలించినట్లు సమాచారం. 35ఎమ్ఎమ్ ప్రింట్‌లను జనవరి 22లోపు ఆయా థియేటర్లుకు అందజేయునున్నారు. ఉన్నత టెక్నాలజీ విలువలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి భాష అవరోధం కాకుండా ఉండేందుకు సబ్ టైటిళ్లను తెర పై ప్రదర్శించనున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot