స్టార్ ఇండియా ఇప్పుడు డిస్నీ స్టార్‌గా పేరును మార్చుకున్నది!! కొత్త ఛానెల్‌లను ప్రకటించింది...

|

నేటి స్మార్ట్ యుగంలో వినోదం కోసం అనేక రకాల మార్గాలు ఉన్నప్పటికీ ప్రజలు రోజు మొత్తం కస్టపడి సాయంత్రం సమయంలో కుటంబంతో సరదాగా గడపడానికి ఎంచుకునే ఒకే ఒక మార్గం టీవీ చూడడం. టీవీ ప్రసారంలో భారతదేశంలో చాలా కాలంగా స్టార్ ఇండియా అతిపెద్ద ప్రసారకర్తలలో ఒకటిగా ఉంది. అయితే ఇప్పుడు ఇది కొత్తగా డిస్నీ స్టార్‌గా రీబ్రాండ్ చేయబడింది. మూడు సంవత్సరాల క్రితం డిస్నీ సంస్థ స్టార్ ఇండియా మరియు దాని అనేక ఇతర ఆస్తులను 21వ సెంచరీ ఫాక్స్ నుండి స్వాధీనం చేసుకునే ప్రక్రియను పూర్తి చేసింది. డిస్నీ సంస్థ స్టార్ ఇండియాను కొనుగోలు చేసిన తర్వాత అనధికారికంగా డిస్నీ స్టార్‌ని ఉపయోగించే పరిణామాలు పరిశ్రమలో మరింత పెరగడం కూడా ఆశ్చర్యపోనవసరం లేదు.

 

డిస్నీ స్టార్‌

డిస్నీ స్టార్‌గా రీబ్రాండ్ చేయబడిన పేరు అధికారికంగా ఏప్రిల్ 14, 2022న సాధారణ ప్రజలకు ప్రకటించబడింది. డిస్నీ స్టార్ ఫాక్స్ లైఫ్, నాట్ జియో, ఏషియానెట్, UTV మరియు హంగామా వంటి అనేక పెద్ద జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లకు (GEC) యజమానిగా ఉన్నారు. స్టార్ ఇండియా యొక్క ట్విట్టర్ హ్యాండిల్ పేరు కూడా ఇప్పుడు డిస్నీ స్టార్ గా మార్చబడింది.

డిస్నీ స్టార్ ఒడియా GEC స్టార్ కిరానో కొత్త ఛానెల్

డిస్నీ స్టార్ ఒడియా GEC స్టార్ కిరానో కొత్త ఛానెల్

డిస్నీ స్టార్‌గా రీబ్రాండ్ చేసిన తరువాత డిస్నీ స్టార్ సంస్థ త్వరలోనే కొత్తగా ఒక ప్రాంతీయ ఛానెల్ ను లాంచ్ చేయనున్నది. ఒడియా రీజనల్ భాషలో ఒడియా GEC ఛానెల్ స్టార్ కిరానోను ప్రారంభించబోతోంది. ఈ ఛానెల్ జూన్ 1, 2022 నుంచి ప్రసార కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని గుర్తుంచుకోండి. డిస్నీ స్టార్ సంస్థ ప్రజలకు HD మరియు SD ఛానెల్‌లను అందుబాటులో ఉంచింది. డిస్నీ స్టార్ ఇప్పటికే బెంగాలీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తెలుగు మరియు తమిళం వంటి భాషలలో ప్రాంతీయ ఛానెల్‌లను కలిగి ఉంది. ఒడియా భాషా కంటెంట్‌తో కూడిన ఛానెల్‌ని అందించడంలో కంపెనీ అడుగు పెట్టడం ఇదే మొదటిసారి.

డిస్నీ స్టార్ ఒడియా
 

డిస్నీ స్టార్ ఒడియా భాషలో లాంచ్ చేస్తున్న కొత్త ఛానల్ 'కిరానో' అనేది భారతీయ పదం కిరణ్ (దీని అర్థం 'కాంతి కిరణం') అని గుర్తుంచుకోండి. ఈ ఛానల్ ప్రారంభంతో ఒడియా టీవీ పరిశ్రమకు కూడా మంచి ఊతమివ్వనుంది. ఒడియా కంటెంట్‌ను చూసే వ్యక్తులు ఎక్కువగా తరంగ్ టీవీ మరియు జీ సార్థక్ వంటి రెండు టీవీ ఛానెల్‌లను చూడడానికి అధికంగా ఇష్టపడతారు. కానీ ఈ ఛానెల్‌లు ఏవీ HD రిజల్యూషన్‌లో అందుబాటులో లేవు. అయితే డిస్నీ స్టార్ యాజమాన్యంలోని స్టార్ కిరానో SD మరియు HD రిజల్యూషన్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. మే 15న డిస్నీ స్టార్ కూడా SD మరియు HD రిజల్యూషన్‌లో ప్రవాహ్ సినిమాని ప్రారంభించబోతోంది.

Best Mobiles in India

English summary
Star India Has Now Changed it's Name to Disney Star! Announcing New Channels

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X