ఛానెల్‌ల ధరలను పెంచుతున్న స్టార్ ఇండియా

|

డిటిహెచ్ పరిశ్రమలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) టారిఫ్ పాలన అమలులోకి వచ్చినప్పటి నుండి చాలా రకాల మార్పులు అమలులోకి వచ్చాయి. ఈ ప్రధాన మార్పులలో కొన్ని ఛానల్ ల యొక్క ధరలు పెరిగాయని టెలికాం రెగ్యులేటర్ DTH పరిశ్రమ అంగీకరించింది.

 

ట్రాయ్

ట్రాయ్ అధికారం కొన్ని ప్రధాన నియమ మార్పులను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రధానంగా ఛానల్ ప్యాక్ల ధరలు మరియు నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు (NCF) ఉన్నాయి. ఈ కొత్త మార్పులో భాగంగా ఛానల్ ప్యాక్‌ల యొక్క విపరీతమైన డిస్కౌంట్ DPO (డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్ ఆపరేటర్లు)ల నుండి ఆగిపోతుంది. ఇందులో భాగంగా డిస్ట్రిబ్యూటర్లు తమ ఛానెల్‌లలో కొన్నింటి ధరలను తగ్గించారు.

 

 

Samsung Galaxy Fold 2 : లీక్ అయిన ఫీచర్స్ ఇవే.....Samsung Galaxy Fold 2 : లీక్ అయిన ఫీచర్స్ ఇవే.....

బ్రాడ్‌కాస్టర్‌
 

ట్రాయ్ యొక్క కొత్త డిటిహెచ్ నిబంధనల మార్పుల ప్రకారం నెలకు రూ.12 కన్నా తక్కువ ధర ఉన్న ఛానెల్‌లను ఛానల్ ప్యాక్‌లలో మాత్రమే చేర్చవచ్చు. మిగిలిన ఛానెల్‌లను విడిగా రిటైల్ చేయాల్సి ఉంటుంది. స్టార్ ఇండియా తమకు సంబందించిన ఛానెళ్ల ధరలను ఇప్పుడు మార్పులు చేస్తున్న మొదటి బ్రాడ్‌కాస్టర్‌గా అవతరిస్తుంది. రాబోయే వారాల్లో కూడా స్టార్ ఇండియా తన ఛానల్ ధరలలో కొన్ని పెద్ద మార్పులు చేయనుంది. దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

నూతన సంవత్సరం మొదటి రోజు వాట్సాప్ రికార్డ్ !!!! అది ఏమిటో తెలుసా?నూతన సంవత్సరం మొదటి రోజు వాట్సాప్ రికార్డ్ !!!! అది ఏమిటో తెలుసా?

స్టార్ ఇండియా ఛానెల్‌ల ధరల మార్పులు

స్టార్ ఇండియా ఛానెల్‌ల ధరల మార్పులు

స్టార్ ఇండియా యొక్క ఛానెళ్ల ప్రస్తుత ధరలు జనవరి 2020 చివరి వరకు చెల్లుబాటు అవుతాయని స్టార్ ఇండియా తెలిపింది. ఫిబ్రవరి 1, 2020 నుండి స్టార్ ఇండియా తమ ఛానెళ్లకు కొత్త ధరను ప్రారంబించనున్నది. ఈ మార్పులలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం స్టార్ ఇండియా తమ ఛానెల్‌ల ధరలను పెంచడం. ఉదాహరణకు సీజనల్ ఆఫర్‌లో భాగంగా అక్టోబర్‌ నెలలో స్టార్ ఇండియా తన 16 ప్రముఖ ఛానెళ్ల ధరలను రూ.12 కు తగ్గించింది. కానీ జనాదరణ పొందిన ఈ ఛానెల్‌లు చాలా వ్యక్తిగత ఎంపికలుగా మాత్రమే అందుబాటులో ఉంటాయి.

 

ఇండియన్స్ రోజులో స్మార్ట్‌ఫోన్‌ను ఎంత సేపు వాడుతున్నారో తెలుసా?ఇండియన్స్ రోజులో స్మార్ట్‌ఫోన్‌ను ఎంత సేపు వాడుతున్నారో తెలుసా?

ఛానెళ్ల ధరలు

ఛానెళ్ల ధరలు

కొత్త నిబంధనల ప్రకారం స్టార్ ప్లస్, స్టార్ జల్షా, స్టార్ మా టివి, విజయ్ టివి, ఏషియానెట్, స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం, స్టార్ స్పోర్ట్స్ 1 మరాఠీ, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 1 బంగ్లా, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ, మరియు స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1ల యొక్క కొత్త ధరలు ఒక్కొక్కటి రూ.19లుగా ఉంటాయి. మా మూవీస్, స్టార్ గోల్డ్, ఏషియానెట్ మూవీస్ వంటి ఇతర ఛానెళ్ల యొక్క ధరలు ఒక్కొక్కటి 15 రూపాయలుగా ఉంటాయి. స్టార్ సువర్ణ, స్టార్ భరత్ ఛానెళ్ల యొక్క MRP ధర 12 రూపాయలుగా ఉంటుంది. స్టార్ ప్రవా, జల్షా మూవీస్ ఛానెళ్ల యొక్క ధర ఒక్కొక్కటి రూ.10లుగా ఉంది. అదేవిధంగా ఇతర ఎస్డీ ఛానెళ్ల యొక్క ధరలు రూ.10ల కింద ఉంటుంది.

 

 

ఇంటర్నెట్ లేకుండా ఫైల్ లను బదిలి చేసే ప్రయత్నంలో ఒప్పో, షియోమి & వివోఇంటర్నెట్ లేకుండా ఫైల్ లను బదిలి చేసే ప్రయత్నంలో ఒప్పో, షియోమి & వివో

స్టార్ ఇండియా నుండి కొత్త ఛానెల్స్

స్టార్ ఇండియా నుండి కొత్త ఛానెల్స్

స్టార్ ఇండియా యొక్క ఛానెల్స్ ధరలు రాబోయే రోజుల్లో పెద్దగా మారుతున్నది. కానీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో స్టార్ ఇండియా కొత్త ఛానెళ్లను ప్రారంభించనున్నట్లు బ్రాడ్‌కాస్టర్ వెల్లడించింది. ఈ కొత్త ఛానెల్‌లలో మూడు హెచ్‌డి ఛానెల్‌లు మరియు రెండు ఎస్‌డి ఛానెల్‌లు ఉన్నాయి అని తెలిపారు. అలాగే స్టార్ ఇండియా మూవీస్ ఛానెల్ యొక్క పేరును స్టార్ గోల్డ్ 2 గా మారుస్తున్నది. కొత్తగా లాంచ్‌ చేస్తున్న ఎస్‌డి ఛానెళ్లలో విజయ్ మ్యూజిక్ మరియు స్టార్ మూవీస్ సెలెక్ట్ ఉన్నాయి. అలాగే హెచ్‌డి ఛానెళ్లలో స్టార్ గోల్డ్ 2 హెచ్‌డి, స్టార్ స్పోర్ట్స్ 3 హెచ్‌డి, మరియు డిస్నీ ఛానల్ HD వంటివి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Star India Most Popular Channels Prices are Hicked and 5 New Channels Starting Announced

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X