స్టార్ వార్స్ స్పెషల్ ఎడిషన్‌లో ‘వన్‌ప్లస్ 5టీ’, డిసెంబర్ 14 నుంచి సేల్

Posted By: BOMMU SIVANJANEYULU

స్టార్ వార్స్ ఫ్రాంచైజీ నుంచి రాబోతోన్న అప్‌కమ్మింగ్ మూవీ ''స్టార్ వార్స్ : ది లాస్ట్ జేడీ’’ డిసెంబర్ 15న భారత్‌లో విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని వన్‌ప్లస్ ఇంకా డిస్నీ కంపెనీలు సంయుక్తంగా వన్‌ప్లస్ 5టీ స్టార్ వార్స్ పేరుతో స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. డిసెంబర్ 14న ఈ ఫోన్ రిలీజ్ అవుతుంది. లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రమే ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది.

BSNL ధమాకా : అన్‌లిమిటెడ్ డేటా, అపరిమిత కాల్స్, రూ. 187కే..

స్టార్ వార్స్ స్పెషల్ ఎడిషన్‌లో ‘వన్‌ప్లస్ 5టీ’, డిసెంబర్ 14 నుంచి సేల

షియోమి మిస్టరీ, ఫోన్లను అంత తక్కువ ధరకే ఎలా ఇస్తోంది..?

వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌ బడ్జెట్ ప్రెండ్లీ ప్రైస్ ట్యాగ్‌లో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఈ ఫోన్‌లో గేమింగ్ కూడా అత్యుత్తమంగా ఉంటుంది. ఇప్పటికే కొన్ని స్టార్‌వార్స్ ఎడిషన్‌లకు సంబంధించిన గేమ్‌లను ఈ ఫోన్‌లలో ప్లే చేయటం జరిగింది. గేమ్స్ ప్లే అవుతున్న సమయంలో ఎటువంటి అంతరాయాలను ఫేస్ చేయలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కస్టమైజిడ్ డిఎన్‌డి మోడ్‌తో అంతరారయంలేని గేమింగ్..

వన్‌ప్లస్ 5తో పోలిస్తే ఇంక్రిమెంటల్ అప్‌డేట్‌లతో లాంచ్ అయిన వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌కు అలర్ట్ స్లైడర్ ఫీచర్ ఓ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఇదే ఫీచర్‌ను వన్‌ప్లస్ 5టీ స్టార్‌ వార్స్ ఎడిషన్‌లోనూ వన్‌ప్లస్ పొందుపరచబోతోంది. ఈ అలర్ట్ స్లైడర్ ఫీచర్ అనేది ఫోన్ ఎడమ చేతి వైపు ఉంటుంది. ఈ స్లైడర్‌లో రింగ్, డు నాట్ డిస్ట్రబ్, సైలట్ పేర్లతో మూడు డీఫాల్ట్ పొజీషన్స్ ఉంటాయి.

గేమ్స్ ఆడుతోన్న సమయంలో అలర్ట్ స్లైడర్‌ను 'డు నాట్ డిస్ట్రబ్' మోడ్‌కు కస్టమైజ్ చేసుకున్నట్లయితే అంతరాయంలేని గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆస్వాదించే వీలుంటుంది. ఈ మోడ్‌లో ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ అనేవి రావు.

గేమర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన వన్‌ప్లస్ 5టీ స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లో అలర్ట్ స్లైడర్ ఫీచర్‌తో పాటు స్టార్ వార్స్ థీమ్డ్ వాల్ పేపర్స్ ఉంటాయి. ఈ ఫోన్‌లో స్టార్ వార్స్ గేమ్స్ ఆడే ముందు సెట్టింగ్స్‌లోని అడ్వాన్సుడ్ విభాగంలోకి వెళ్లి గేమింగ్ డు నాట్ డిస్ట్రబ్ ఆప్షన్ పై టాప్ చేసినట్లయితే మోడ్ యాక్టివేట్ అవుతుంది.

వన్‌ప్లస్ 5టీ స్టార్‌వార్స్ ఎడిషన్‌లో మీరు ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉన్న 5 అత్యుత్తమ స్టార్ వార్స్ గేమ్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

క్నైట్స్ ఆఫ్ ది ఓల్డ్ రిపబ్లిక్ (Knights of the Old Republic):

స్టార్ వార్స్ విశ్వంలో సెట్ చేయబడిన ఈ రోల్ - ప్లేయింగ్ వీడియో గేమ్‌ను బయోవేర్ కంపెనీ అభివృద్ది చేయగా లుకాస్‌ఆర్ట్స్ కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ గేమ్ ఇతివృత్తాన్ని పరిశీలించినట్లయితే.. గెలాక్సీ సామ్రాజ్యం ఏర్పాటుకు 4000 సంవత్సరాల ముందు క్నైట్స్ ఆఫ్ ది ఓల్డ్ రిపబ్లిక్ చోటుచేసుకుంటుంది. ఈ గేమ్‌లో కీలక పాత్ర అయిన జేడీ స్టార్ వార్స్ విశ్వంలోని వివిధ గ్రహాల్లో సంచరిస్తూ మలాక్‌ను ఓడించాల్సి ఉంటుంది.

స్టార్ వార్స్ రోగ్ లీడర్ (Star Wars Rogue Leader):

స్టార్ వార్స్ రోగ్ స్క్వాడ్రన్ 2గా పిలవబడే ఈ యాక్షన్ గేమ్‌ను ఫ్యాక్టర్ 5 అలానే లుకాస్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసాయి. రోగ్ స్క్వాడ్రన్ సిరీస్ నుంచి లాంచ్ అయిన మూడు గేమ్‌లలో ఇది రెండవది. ఈ గేమ్‌లోని ప్లేయర్స్ స్టార్ వార్స్ షిప్‌లలో ప్రయాణిస్తూ ఇచ్చిన టాస్కులను పూర్తి చేయవల్సి ఉంటుంది.

స్టార్ వార్స్ బ్యాటిల్‌ఫ్రంట్ (Star Wars Battlefront) :

ఈ గేమ్‌లో భాగంగా ప్లేయర్స్ ఐకానిక్ బ్యాటిల్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. పూర్తిస్థాయి స్టార్ వార్స్ వాతావరణాన్ని ఈ గేమ్ ప్రతిబింభిస్తుంది. వెపన్స్ దగ్గర నుంచి సౌండ్ ఎఫెక్ట్స్ వరకు అన్ని రియలాస్టిక్‌గా ఉంటాయి.

జేడీ క్నైట్ 2 : జేడీ అవుట్‌కాస్ట్ (Jedi Knight 2: Jedi Outcast) :

ఈ ఫాంటసీ గేమ్‌లో భాగంగా ప్లేయర్స్ స్టార్ వార్స్ గెలాక్సీలో సంచరిస్తూ సామ్రాజ్యం కొరకు పోరాడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో లైట్‌సాబిర్‌లను ఉపయోగించి స్ట్రోమ్‌స్ట్రూపర్స్ అవయువాలను కత్తిరించాల్సి ఉంటుంది.

స్టార్ వార్స్ : ది ఓల్డ్ రిపబ్లిక్ (Star Wars: The Old Republic) :

ఈ యాక్షన్ గేమ్‌లో, ప్లేయర్స్ జేడీ క్నైట్ పాత్రలో న్యాయం కోసం పోరాడాల్సి ఉంటుంది. ఉత్కంఠభరితంగా సాగిపోయే ఈ గేమ్‌లో అనేక ట్వస్ట్స్ ఇంకా టర్న్స్ ఉంటాయి.

డిసెంబర్ 14న మార్కెట్లోకి, అమెజాన్‌లో లభ్యం..

డిసెంబర్ 14న ముంబైలో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా వన్‌ప్లస్ 5టీ స్టార్‌వార్స్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ ఆన్‌లైన్ అలానే ఆఫ్‌లైన్ మార్కెట్లలో లభ్యమవుతుంది.

ఆన్‌లైన్ మార్కెట్‌కు వచ్చేసరికి అమెజాన్ ఇండియాతో పాటు వన్‌ప్లస్ స్టోర్.ఇన్‌లు ఈ డివైస్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనున్నాయి. ఆఫ్‌లైన్ మార్కెట్ విషయానికొస్తే నోయిడా, బెంగుళూరులోని వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ జోన్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర వివరాలు వెల్లడికావల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో, Airtelకి పోటీగా ఐడియా 84 రోజుల కొత్త ప్లాన్

English summary
The release date of the OnePlus 5T Star Wars edition coincides with that of the Star Wars: The Last Jedi movie that will debut on December 15.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot