Home
News

భారత్‌లో స్టార్‌లింక్ కనెక్షన్‌లు 20 లక్షలు మాత్రమే.. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు : కేంద్ర మంత్రి పెమ్మసాని

Starlink Satellite Internet Services : భారత్‌ లో త్వరలో స్టార్‌లింక్‌ ద్వారా శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కీలకమైన అనేక అనుమతులను ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని స్టార్‌లింక్‌ (స్పేస్‌ఎక్స్ - SpaceX) పొందింది. అయితే తాజాగా కేంద్ర టెలికాం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు BSNL టారిఫ్‌లపైనా కీలక ప్రకటన చేశారు.

భారత్‌ లో గరిష్ఠంగా 20 లక్షణ కనెక్షన్‌లు మాత్రమే! :
భారత్‌ లో స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసులకు సంబంధించి గరిష్ఠంగా 20 లక్షల కనెక్షన్‌లను మాత్రమే అందించగలదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. ఫలితంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL సహా ఇతర సంస్థలకు భవిష్యత్‌ లో పెద్దగా ముప్పును కలిగించే అవకాశం ఉండదని చెప్పారు. మరియు స్టార్‌లింక్ గరిష్ఠంగా 200 mbps వేగంతోనే ఇంటర్నెట్‌ సేవలను అందించగలదని చెప్పారు.

starlink in india

హైదరాబాద్‌లో నిర్వహించిన BSNL ( భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ) సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. BSNL ప్రస్తుతం బలంగా ఉన్న గ్రామీణ, మారుమూల ప్రాంతాలను ఈ శాటిలైట్‌ కమ్యూనికేషన్ల సర్వీసులు లక్ష్యంగా చేసుకొనే అవకాశం ఉందన్నారు. కాబట్టి పోటీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

అయితే శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసుల ముందస్తు ధర ఎక్కువగా ఉంటుందని, దీంతోపాటు నెలవారీ ఛార్జీ సుమారుగా రూ.3000 గా ఉండే అవకాశం ఉందని కేంద్ర మంత్రి చెప్పారు. ఇటీవల లీక్‌ అయిన వివరాల ఆధారంగా స్టార్‌లింక్‌ కు సంబంధించిన పరికరాల కోసం సుమారు రూ.33 వేలు ముందస్తుగా చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు :
దీంతోపాటు BSNL 4G నెట్‌వర్క్‌ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G విస్తరణ పూర్తయిందని చెప్పారు. ముందుగా మార్కెట్‌ ను బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి టారిఫ్‌ల పెంపు ఆలోచన లేదని కేంద్ర మంత్రి చెప్పారు.

7 వేల శాటిలైట్‌లు :
స్టార్‌లింక్‌ LEO (లో ఎర్త్ ఆర్బిట్‌) ఉహగ్రహాల ద్వారా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌ (Satellite broadband) సర్వీసులను అందిస్తోంది. ఈ ఉహగ్రహాలు భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాయి. ప్రస్తుతం 7000 శాటిలైట్‌ల ద్వారా స్టార్‌లింక్‌ ఈ సేవలను అందిస్తోంది. భవిష్యత్‌ లో వీటిని 40 వేలకు పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం 100 కు పైగా దేశాల్లో స్టార్‌లింక్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

ఇప్పటికే కీలక అనుమతులు జారీ :
జూన్‌ నెలలో స్టార్‌లింక్ కు టెలికాం విభాగం ( DoT ) అనుమతులు జారీ చేసింది. జులై నెల రెండో వారంలో కీలకమైన ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ అథరైజేషన్‌ సెంటర్‌ ( IN-SPACe ) లైసెన్స్‌ మంజూరు చేసింది. ఇంకా ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్‌ పొందడం, బేస్‌ స్టేషన్‌ ల ఏర్పాటు వంటివి ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
starlink can give 20 lakhs connections only in india said MOS telecom pemmasani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X