Home
News

మస్క్ 'స్టార్‌లింక్' వచ్చేస్తోంది.. స్పీడ్, ధరలు ఎలా ఉండబోతున్నాయో తెలుసా?

Starlink: ఎలాన్ మస్క్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన స్టార్‌లింక్ అనే శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ నడుపుతున్నారు. వీళ్లకి ఇండియాలో లైసెన్స్ కావాలి. కానీ సెక్యూరిటీ రూల్స్, డేటా స్టోరేజ్ విషయంలో చాలా ఏళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు భారత ప్రభుత్వం చెప్పిన అన్ని కండీషన్స్‌కి స్టార్‌లింక్ ఓకే అనేసింది. ముఖ్యంగా మన యూజర్ల డేటా అంతా ఇండియాలోనే స్టోర్ చేస్తామని, అవసరమైనప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు డేటా యాక్సెస్ ఇస్తామని ఒప్పుకున్నారు.

* ఇండియా ఎందుకంత ముఖ్యం

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లలో ఒకటి. ఇక్కడ టెలికాం కంపెనీలతో కలిసి పనిచేయడానికి, డైరెక్ట్‌గా కస్టమర్లకు సర్వీసులు ఇవ్వడానికి స్టార్‌లింక్‌కి బోలెడంత అవకాశం ఉంది. ఇక్కడ సర్వీసులు తీసుకొస్తే చాలా డబ్బులు సంపాదించొచ్చు కాబట్టే, స్టార్‌లింక్ ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీ పాలసీలకు తలొగ్గింది.

Starlink Coming to India  Know about Speed  Pricing  and More

* లైసెన్స్ ప్రాసెస్ ఏంటి

ప్రస్తుతం స్టార్‌లింక్ అప్లికేషన్ హోమ్ మంత్రిత్వ శాఖ (MHA) పరిశీలనలో ఉంది. కొన్ని రూల్స్‌ని సడలించాలని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్‌ (DoT)ని కూడా స్టార్‌లింక్ అడిగింది. కానీ ఏ ఫారిన్ కంపెనీలకైనా, స్టార్‌లింక్ అయినా, అమెజాన్ ప్రాజెక్ట్ క్యూపర్ అయినా సెక్యూరిటీ స్టాండర్డ్స్‌లో ఏ మార్పులు ఉండవని గవర్నమెంట్ తేల్చి చెప్పింది.

అయినా కూడా స్టార్‌లింక్ ఫార్మల్‌గా అప్లికేషన్ పెట్టడం చూస్తే, లైసెన్స్ ప్రాసెస్ ముందుకు సాగుతున్నట్లే అనిపిస్తోంది. మస్క్ ఎలాగైనా భారతీయులకు శాటిలైట్ ఇంటర్నెట్ తీసుకురావాలని బాగా ప్రయత్నిస్తున్నారు. ఆ సర్వీసులో ఈ సంవత్సరంలోనే అందుబాటులోకి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు ప్రతి మారుమూల ప్రాంతానికి ఇంటర్నెట్ సదుపాయం ఉంటుంది.

* స్టార్‌లింక్ ఎలా పనిచేస్తుంది

స్పేస్‌ఎక్స్ ఆపరేట్ చేసే స్టార్‌లింక్.. లో-ఎర్త్ ఆర్బిట్‌లో వేల సంఖ్యలో చిన్న శాటిలైట్లను ఉపయోగించి హై-స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది. కేబుల్స్‌పై ఆధారపడే ట్రెడిషనల్ బ్రాడ్‌బ్యాండ్ లా కాకుండా, స్టార్‌లింక్ శాటిలైట్ల నుంచి గ్రౌండ్ యూజర్లకు రేడియో సిగ్నల్స్ ద్వారా డేటాను ట్రాన్స్‌మిట్ చేస్తుంది.

దీంతో మిగతా నెట్‌వర్క్‌లు కష్టపడే రిమోట్ ఏరియాల్లో కూడా ఇంటర్నెట్ అందుతుంది. స్పీడ్ పెంచడానికి, డిలేస్ తగ్గించడానికి స్పేస్‌ఎక్స్ తన శాటిలైట్ నెట్‌వర్క్‌ను 42,000 వరకు విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. వియాసాట్, హ్యూస్నెట్, అమెజాన్ కుయిపర్ వంటి ఇతర శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్లు కొన్ని పెద్ద శాటిలైట్లపై ఆధారపడతారు.

కానీ స్టార్‌లింక్ మాత్రం గ్రౌండ్ స్టేషన్ల అవసరం తగ్గించడానికి లేజర్ లింక్‌లను ఉపయోగించే చాలా చిన్న శాటిలైట్లను వాడుతుంది. ఇంకా ఇది ప్లగ్-అండ్-ప్లే సెటప్‌తో వస్తుంది. అమెరికాలో అయితే హోమ్ డిపో, బెస్ట్ బై, వాల్‌మార్ట్ వంటి స్టోర్స్‌లో ఇన్స్టాలేషన్ కిట్‌లు కొనుక్కోవచ్చు. స్టార్‌లింక్ యాప్ బెస్ట్ ఇన్స్టాలేషన్ స్పాట్ కనుక్కోవడానికి హెల్ప్ చేస్తుంది.

* ఇంటర్నెట్ స్పీడ్స్ ఎలా ఉంటాయి.

స్టార్‌లింక్ మొదట్లో 150 Mbps స్పీడ్‌తో స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఎక్కువ శాటిలైట్లు ఆర్బిట్‌లోకి రావడంతో కొన్ని ఏరియాల్లో 264 Mbps వరకు స్పీడ్స్ అందుతున్నాయి. లొకేషన్‌ను బట్టి స్పీడ్స్ మారొచ్చు. మారుమూల ప్రాంతాల్లో కొంచెం స్లోగా ఉండొచ్చు. రియల్-టైమ్ స్పీడ్ అప్‌డేట్స్ కోసం స్టార్‌లింక్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

* ప్లాన్స్, ధరలు ఎలా

స్టార్‌లింక్‌లో డిఫరెంట్ హార్డ్‌వేర్, డేటా ప్లాన్స్ ఉన్నాయి. స్టాండర్డ్ కిట్ వన్‌టైమ్ 349 డాలర్లు ఉండగా మంత్లీ ప్లాన్ 120 డాలర్లు. స్టార్‌లింక్ మినీ కిట్ 599 డాలర్లు ఉండగా మంత్లీ ప్లాన్స్ 50 (50GB డేటా) డాలర్ల నుంచి ప్రారంభమవుతాయి. అన్‌లిమిటెడ్ ప్లాన్ 165 డాలర్లు.

మెరిటైమ్ ప్లాన్ (బోట్ల కోసం) హార్డ్‌వేర్ 2,500 డాలర్లు. మంత్లీ ప్లాన్స్ 250 (50GB) డాలర్ల నుంచి ప్రారంభమవుతాయి. 1TB కోసం వెయ్యి డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. పైప్అడాప్టర్ 120 డాలర్లకు, Gen 3 వై-ఫై రౌటర్ 199 డాలర్లకు కొనొచ్చు. మరిన్ని యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. స్టాండర్డ్ కిట్‌ను స్టేషనరీ బోట్స్‌లోనూ యూజ్ చేయొచ్చు.

ఇవి వేరే దేశాల్లోని ధరలు. మన దేశంలో వీటి కంటే తక్కువ ధరలు ఉండొచ్చు. చాలా విషయాలను పరిగణలోకి తీసుకొని ప్లాన్ల ధరలు నిర్ణయించే అవకాశం ఉంది. పోటీదారులను తొక్కేసేలాగా మస్క్ ప్లాన్ ధరలను నిర్ణయించవచ్చు.

* సబ్‌స్క్రిప్షన్ ఎలాగైనా తీసుకోవచ్చు

స్టార్‌లింక్‌లో లాంగ్-టర్మ్ కాంట్రాక్ట్స్ ఏమీ ఉండవు. కావాలంటే సేవలను తాత్కాలికంగా ఆపేయవచ్చు, మళ్లీ కావాలంటే సేవలను తిరిగి అందుకోవడం ప్రారంభించవచ్చు. 30 రోజుల ఫ్రీ ట్రయల్ కూడా ఉంది. ఫుల్ రీఫండ్ ఆప్షన్‌తో వస్తుంది. ప్రస్తుతం నార్త్, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో స్టార్‌లింక్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

చైనాలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇండియా కండీషన్స్‌కి స్టార్‌లింక్ ఓకే చెప్పడంతో, లైసెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ లైసెన్స్ వస్తే, ఇండియాలోని రిమోట్ ఏరియాలకు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Starlink accepted India's data rules for license approval in the large Indian broadband market. Using low Earth orbit satellites, Starlink offers high-speed internet globally, competing with traditional and satellite providers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X