'శాటిలైట్ నుంచి సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్' బీటా టెస్టింగ్.. స్టార్‌లింక్ గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందా..?
టెలికాం రంగం అభివృద్ధి చెందుతోంది. గతంలో కొందరికే పరిమితమైన మొబైల్, ఇంటర్నెట్ సేవలు ప్రస్తుతం అత్యధిక శాతం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. మరియు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భారత్ టాప్‌లో ఉంది. దీంతోపాటు టెలికాం రంగంలో టెక్నాలజీ వినియోగం కూడా భారీగా పెరిగింది. భారత్‌లో ప్రస్తుతం ప్రైవేటు సంస్థలు 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. మరికొన్ని నెలల్లో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కూడా 4G, 5G నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ కానుంది.
దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చింది. అయితే పట్టణాలు, నగరాలతో పోలిస్తే కాస్త వెనుకబడి ఉంది. మౌలిక సదుపాయాలు, పూర్తిస్థాయిలో నెట్‌వర్క్ టవర్లు అందుబాటులోకి లేకపోవడంతో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లో ఇంటర్నెట్ వేగం కాస్త తక్కువగా ఉంటోంది.

అయితే స్టార్‌లింక్ తాజా ప్రాజెక్ట్ విజయవంతం (Starlink Direct to Cell) అయితే పట్టణ ప్రాంతాలతో సమానంగా మారుమూల గ్రామీణ, కొండ ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుతుంది. కేవలం ఇంటర్నెట్ మాత్రమే కాదు నాణ్యమైన కాలింగ్ కూడా సొంతం అవుతుంది. అదికూడా మొబైల్ టవర్లతో సంబంధం లేకుండా.. నాణ్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయి.
జనవరి 27 న డైరెక్ట్ టూ సెల్ బీటా టెస్టింగ్‌ను ప్రారంభించినట్లు స్టార్‌లింక్ తెలిపింది. భూకక్ష్యలో ఉన్న శాటిలైట్‌ల ద్వారా నేరుగా మొబైల్‌కు సిగ్నల్‌ను అందిస్తుంది. ఇప్పటికే ఈ తరహా సర్వీసుల కోసం BSNL.. వయాశాట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ అంతరిక్షం నుంచే నేరుగా సిగ్నల్ అందించనుంది. ఈ బీటా టెస్టింగ్ విజయవంతం అయితే సంస్థ తన పరిధిని విస్తరించుకోవడం సహా టెలికాం నిబంధనల పేరిట ఆ దేశాలపై ఆధారపడకుండా ఉండేలా సేవలను అందించవచ్చు.
ఈ టెస్టింగ్ విజయవంతం అయితే డైరెక్ట్ టూ సేల్ సర్వీసుల రంగంలో స్టార్‌లింక్ గేమ్ ఛేంజర్‌గా నిలిచే అవకాశం ఉంటుంది. భూమి పైన ఉండే మొబైల్ నెట్‌వర్క్ టవర్లతో సంబంధం లేకుండా శాటిలైట్ నుంచే నేరుగా సెల్‌కు సిగ్నల్స్‌ను పొందవచ్చు. ఫలితంగా మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్, కాలింగ్, SMS సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఇందుకు సంబంధించిన శాటిలైట్‌లను స్టార్‌లింక్ ఇప్పటికే అంతరిక్షంలోకి పంపింది. అయితే శాటిలైట్ సిగ్నల్స్ అందుకొనేందుకు వీలుగా అత్యాధునిక హార్డ్‌వేర్, రూటర్లు అవసరం లేదని తెలుస్తోంది. అయితే ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌లు ఈ టెక్నాలజీని సపోర్టు చేయాల్సి ఉంటుంది. ఇటువంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను ప్రముఖ సంస్థలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
అయితే ప్రస్తుతానికి ఈ టెక్నాలజీ టెస్టింగ్ దశలో ఉంది. కచ్చితంగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే వివరాలు వెల్లడి కాలేదు. దీంతోపాటు భారత్‌కు వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతోపాటు ధరలో ఏ విధంగా ఉంటాయనే సమాచారం కూడా అందుబాటులో లేదు.
ప్రభుత్వ రంగ సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) కూడా D2D (డైరెక్ట్ టూ డివైజ్) టెక్నాలజీ కోసం వయాశాట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టెక్నాలజీని ఇటీవలే టెస్టింగ్ చేసింది. అనంతరం ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉపయోగించి నాన్ టెర్రిస్ట్రియల్ నెట్‌వర్క్ కనెక్టివిటీతో టెస్టింగ్ చేస్తోంది.
అయితే BSNL మరియు స్టార్‌లింక్‌కు మధ్య కొన్ని వ్యత్యాసాలున్నాయి. స్టార్‌లింక్ శాటిలైట్‌లు భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులో ఉండి, సేవలు అందించనున్నాయి. అదే BSNL- వయాశాట్ కు చెందిన శాటిలైట్‌లు మరింత ఎత్తులో ఉంటాయని తెలుస్తోంది. జియో స్టేషనరీ L బ్యాండ్ ఉపగ్రహాలపై ఆధారపడి సర్వీసులు అందిస్తాయని సమాచారం.


Click it and Unblock the Notifications








