Home
News

భారత్‌లోకి శాటిలైట్‌ ఇంటర్నెట్‌.. స్టార్‌లింక్‌ కు కీలక లైసెన్స్‌ను జారీ చేసిన టెలికాం విభాగం..!

Satellite internet services in india : భారత్‌ లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసుల ప్రారంభానికి కీలక ముందడుగు పడింది. ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు గతంలో లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ మంజూరు అయింది. అయితే తాజాగా టెలికమ్యూనికేషన్‌ విభాగం (DoT) స్టార్‌లింక్‌కు గ్లోబల్‌ మొబైల్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్ బై శాటిలైట్‌ (GMPCS) లైసెన్స్‌ను జారీ చేసింది. భారత్‌లో ఈ తరహా లైసెన్స్‌ను పొందిన మూడో సంస్థగా స్టార్‌లింక్‌ (Starlink) నిలిచింది. Reuters ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

మూడు సంస్థగా స్టార్‌లింక్‌ :
భారత్‌లో టెలికమ్యూనికేషన్స్‌ విభాగం నుంచి ఇప్పటికే వన్‌వెబ్‌, రిలయన్స్‌ జియో ఈ లెసెన్స్‌ను పొందాయి. భారత్‌లో స్టార్‌లింక్‌ ద్వారా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను ప్రారంభించేందుకు వీలుగా స్పేస్‌ఎక్స్‌ సంస్థ ఇండియన్‌ స్పేస్‌ రెగ్యూలర్‌, In-SPAC నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను సమర్పించినట్లు తెలుస్తోంది.

starlink

ట్రయల్‌ స్పెక్ట్రమ్‌ :
ఈ లెసెన్స్‌ ప్రక్రియ అనంతరం స్పెక్ట్రమ్‌ కేటాయింపు జరగనుంది. దరఖాస్తు చేసిన 15-20 రోజుల్లో ట్రయల్‌ స్పెక్ట్రమ్‌ మంజూరు చేస్తామని DoT తెలిపింది. భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల ప్రారంభించేందుకు మూడు నాలుగు సంవత్సరాలుగా స్టార్‌లింక్‌ ప్రయత్నం చేస్తోంది.

భారత్‌లో స్టార్‌లింక్‌ సర్వీసుల ప్రారంభానికి ప్రభుత్వం కీలక షరతులు విధించినట్లు తెలుస్తోంది. స్థానికంగానే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు వంటి ఉన్నట్లు తెలుస్తోంది. గేట్‌వేలను ఏర్పాటు చేయడం, నెట్‌వర్క్ ఆపరేషన్స్ సెంటర్‌ సహా మరిన్ని దశలను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

స్పేస్‌ఎక్స్‌ తో ఇప్పటికే ఎయిర్‌టెల్‌, జియో సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలతోపాటు భారత్‌లో పరస్పరం సహకారం అందించుకోనున్నాయి. మార్చి నెలలో ఈ రెండు సంస్థలు స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం చేసుకున్నాయి. స్పేస్‌ఎక్స్‌ అనుబంధ సంస్థ స్టార్‌లింక్‌ ఉపగ్రహాల ద్వారా ఈ సేవలు అందిస్తుంది.

ప్రారంభ ధర రూ.840? :
అయితే ఇటీవలే భారత్‌లో స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ ధరల వివరాలు లీక్‌ అయ్యాయి. దీని ఆధారంగా సుమారు రూ. 840 ప్లాన్‌కే అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చని తెలుస్తోంది. తక్కువ ధరల కారణంగా భారత్‌లో భారీగా యూజర్లను ఆకట్టుకోవాలని స్టార్‌లింక్‌ భావిస్తున్నట్లు ఇటీవల కథనాలు వచ్చాయి. తక్కువ కాలంలోనే 10 మిలియన్‌ యూజర్లను చేర్చుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే నెలవారీ తక్కువ ధరకే శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నా.. స్టార్‌లింక్ హార్డ్‌వేర్‌ కిట్‌ కోసం భారీగా చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీని ధర $250 (భారత కరెన్సీ ప్రకారం రూ.21,300) నుంచి $380 (భారత్‌ కరెన్సీ ప్రకారం సుమారు రూ.32,400) గా ఉంటుందని తెలుస్తోంది.

స్పేస్‌ఎక్స్‌ సంస్థ తన అనుబంధ సంస్థ స్టార్‌లింక్‌ ద్వారా సుమారు 100 కి పైగా దేశాల్లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను అందిస్తోంది. ఇందుకోసం లో ఎర్త్‌ ఆర్బిట్‌లో 6000 ఉపగ్రహాల ద్వారా ఈ సేవలను అందిస్తోంది. భూమికి కేవలం 550 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ.. ఇంటర్నెట్‌ను అందిస్తున్నాయి.

శాటిలైట్‌ ఇంటర్నెట్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాలతోపాటు మారుమూల పర్వత, కొండ ప్రాంతాల్లోనూ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ను అందించేందుకు వీలుంటుంది. ఫలితంగా ప్రకృతి విపత్తులు వంటి సమయాల్లోనూ ఎటువంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
starlink gets licence from telecom department of india regarding satellite internet services
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X