Home
News

భారత్‌లో త్వరలోనే స్టార్‌లింక్‌ సర్వీసులు.. చాలా తక్కువ ధరకే శాటిలైట్‌ ఇంటర్నెట్ సేవలు..?

Starlink Satellite Internet Services : భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెస్ సర్వీసులు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఎయిర్‌టెల్‌, జియో వంటి సంస్థలు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిపై అప్పట్లోనే సంస్థలు ప్రకటన చేశాయి. భారత ప్రభుత్వం పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేస్తే.. స్పేస్‌ఎక్స్ అనుబంధ సంస్థ స్టార్‌ లింక్‌కు చెందిన ఉపగ్రహాల ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్‌ అందించనున్నారు.

అయితే గత నెలలో స్టార్‌లింక్‌ కు భారత ప్రభుత్వం లెటర్‌ ఆఫ్ ఇంటెంట్‌ను జారీ చేసింది. అయితే పూర్తి స్థాయి అనుమతులు రావాల్సి ఉంది. అయితే అనుమతులు రాగానే సేవలు ప్రారంభించేలా స్పేస్‌ఎక్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ కోసం ట్రాయ్‌ (TRAI) కొన్ని సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది.

starlink may launch its satellite internet services in india soon  here are the recommended plans

ప్లాన్‌ ప్రారంభ ధర :
భారత్‌లో స్టార్‌లింక్‌ ప్లాన్‌ ప్రారంభ ధర సుమారుగా రూ.840 వరకు ఉండవచ్చని ఓ నివేదిక వెల్లడించింది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ డేటాను ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది. అయితే అర్బన్‌ యూజర్‌ ఛార్జీ కింద రూ.500 అదనంగా వసూలు చేయాలని టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI) సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకే! :
ఈ అదనపు వసూళ్లతో ప్రస్తుతం ఉన్న వైర్‌, వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల ధర కంటే శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు ఖరీదైనవిగా మారనున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో రూ.500 అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. గ్రామీణ ప్రాంతంలో ఈ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను ప్రోత్సహించేందుకు వీలుగా ట్రాయ్ ఈ దిశగా సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. ఎకనామిక్స్‌ టైమ్స్‌ ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

పెండింగ్‌లో సిఫార్సులు :
భారత్‌లో స్టార్‌లింక్‌ తన సేవలను అందించేందుకు వీలుగా 8 శాతం లైసెన్సింగ్‌ ఫీజుతోపాటు స్పెక్ట్రమ్‌ బ్లాక్‌కు కనీసం రూ.3500 వార్షిక ఛార్జీతోపాటు వార్షిక ఆదాయంలో 4 శాతం ప్రభుత్వానికి చెల్లించాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఈ సిఫార్సులు ప్రభుత్వం వద్ద ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

స్పెక్ట్రమ్ ఖర్చులను భరించేందుకు వీలుగా తక్కువ కాలంలో 10 మిలియన్‌ యూజర్లను సంపాదించుకోవాలని స్టార్‌లింక్‌ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఛార్జీలతో పోలిస్తే వన్‌టైం ఫీజు కింద మరికొంత చెల్లించాల్సిన అవసరం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇతర దేశాల్లోని స్టా్ర్‌లింక్ ప్లాన్‌లతో పోలిస్తే భారత్లో లీక్ అయిన ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

స్టార్‌లింక్‌ LEO (లో ఎర్త్ ఆర్బిట్) లో 6000 ఉపగ్రహాలను కలిగి ఉంది. వీటి ద్వారా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను అందిస్తోంది. ఈ ఉపగ్రహాలు భూమికి కేవలం 550 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ ఇంటర్నెట్‌ను అందిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 కు పైగా దేశాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

భారత్‌లో స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభం అయితే 25 Mbps నుంచి 220 Mbps డౌన్‌లోడ్‌ స్పీడ్‌, 5 Mbps నుంచి 20 Mbps వరకు అప్‌లోడ్‌ స్పీడ్‌ను అందించే అవకాశం ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ప్రారంభంలో మరింత హైస్పీడ్‌తో డేటాను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రారంభంలో యూజర్ల సంఖ్య తక్కువగా ఉంటుందని కనుక.. మరింత హైస్పీడ్‌తో ఇంటర్నెట్‌ అందించేందుకు వీలుంటుందని అంచనా వేస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
starlink may launch its satellite internet services in india soon, here are the recommended plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X