Home
News

భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసులు.. స్టార్‌లింక్‌కు కీలక అనుమతులు (LoI) మంజూరు..!

Satellite Internet Services : శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు త్వరలో భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే ఎయిర్‌టెల్‌, జియో సంస్థలు ఎలాన్ మస్క్‌కు చెందిన స్సేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. స్పేస్‌ఎక్స్ అనుబంధ సంస్థ స్టార్‌లింక్ ఉపగ్రహాల ద్వారా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను అందించనుంది. అయితే భారత ప్రభుత్వం అనుమతికి లోబడి ఒప్పందం అమల్లోకి వస్తుందని ఈ రెండు సంస్థలు ప్రకటన చేశాయి.

లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ :
మనీకంట్రోల్‌ నివేదిక ప్రకారం భారత టెలికాం శాఖ స్పేస్‌ఎక్స్‌కు (SpaceX) లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (Letter Of Intent) ను జారీ చేసినట్లు తెలుస్తోంది. శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభించేందుకు తుది లైసెన్స్‌ పొందవలసి ఉంటుంది. లెసెన్స్‌ షరతులు నెరవేర్చిన తర్వాతే పూర్తిస్థాయి అనుమతులు జారీ చేస్తారని తెలుస్తోంది.

starlink received letter of intent from indian government regarding satellite internet services

షరతులు విధించారా? :
స్పేస్‌ఎక్స్‌కు పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం షరతులు విధించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. స్పేస్‌ఎక్స్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్ కంట్రోల్‌ సెంటర్‌ను భారత్‌లో ఏర్పాటు చేస్తేనే.. అనుమతుల ప్రక్రియపై ముందుకెళ్తామని చెప్పినట్లు తెలిసింది.

కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి! :
దేశంలో అత్యవసర పరిస్థితులు సహా శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు.. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసేందుకు దేశంలో కంట్రోల్‌ సెంటర్‌ అవసరం అని కేంద్ర ప్రభుత్వం భావించినట్లు తెలిసింది. ఇలాంటి సమయాల్లో సమస్యాత్మాక ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపేస్తుంటారు.

దేశంలో ఎమర్జెన్సీ సమయాల్లో ఇంటర్నెట్‌ సేవలపై నిలిపి వేసేందుకు ప్రతిసారి అమెరికాలోని స్పేస్‌ఎక్స్‌, స్టార్‌లింక్‌ ప్రధాన కార్యాలయాలను సంప్రదించడం సాధ్యం కాదని చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం దేశంలోని అన్ని టెలికాం సంస్థలు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తుంటాయి.

జియోతో ఒప్పందం :
ఈ ఒప్పందం లో భాగంగా జియో, స్పేస్‌ఎక్స్‌ పరస్పరం సహకారం అందించుకోనున్నాయి. రిలయన్స్ జియో తన అవుట్‌లెట్‌, ఆన్‌లైన్‌ స్టోర్‌లో స్టార్‌లింక్‌ పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. కస్టమర్‌ సర్వీస్‌ ఇన్‌స్టాలేషన్‌, యాక్టివేషన్‌ కోసం సపోర్టు స్టాఫ్‌ మెకానికాన్ని ఏర్పాటు చేస్తుంది. స్టార్‌లింక్‌ కూడా జియోకు సాయం చేస్తుంది. జియో ఎయిర్‌ ఫైబర్‌, జియో ఫైబర్‌లతోపాటు కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్‌ను విస్తరించేందుకు సాయం చేస్తుంది.

ఎయిర్‌టెల్‌తో ఒప్పందం :
స్పేస్‌ఎక్స్, ఎయిర్‌టెల్‌ సంస్థ ఒప్పందంలో భాగంగా.. ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్ విస్తరణ, మెరుగుపరిచేందుసు సాయం స్పేస్‌ఎక్స్ చేస్తుంది. ఎయిర్‌టెల్‌ స్టోర్‌లలో స్టార్‌లింక్ పరికరాలను అందిస్తుంది. ఎయిర్‌టెల్‌ ద్వారా స్టార్‌లింక్ సేవలు హెల్త్‌ సెంటర్‌లు, స్కూల్స్‌, కమ్యూనిటీలకు అనుసంధానం చేసే అవకాశాలను అన్వేషిస్తుంది.

లో ఎర్త్‌ ఆర్బిట్‌ :
స్పేస్‌ఎక్స్‌ తన అనుబంధ సంస్థ స్టార్‌లింక్‌ (starlink) ద్వారా సుమారు 100 దేశాల్లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను అందిస్తోంది. ఈ సంస్థ లో ఎర్త్‌ ఆర్బిట్‌ (LEO) 6000 ఉహగ్రహాలను కలిగి ఉంది. ఇవి భూమికి సుమారు 550 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ను అందిస్తోంది.

ఇంటర్నెట్‌ స్పీడ్‌ ఎలా ఉంటుంది :
భారత్‌లో స్పేస్‌ఎక్స్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్ సేవలు ప్రారంభం అయితే 25 Mbps నుంచి 220 Mbps డౌన్‌లోడ్‌ స్పీడ్‌ను అందించే అవకాశం ఉంది. మరియు 5 Mbps నుంచి 20 Mbps వరకు అప్‌లోడ్‌ స్పీడ్‌ను అందిస్తుందని తెలుస్తోంది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే తొలిరోజుల్లో శాటిలైట్‌ ఇంటర్నెట్ వేగం మెరుగ్గా ఉంటుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
starlink received letter of intent from indian government regarding satellite internet services
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X