స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు !! 'ఫ్లైట్ లో Wi-Fi' డీల్‌పై మొదటి సంతకం

|

ప్రపంచ కుబేరుడిలో ఒకడైన ఎలన్ మస్క్ ఇండియాలో ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలని ప్రయత్నాలను చేయడమే కాకుండా అనేక దేశాలలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను అందించాలని ప్రయత్నాలను చేస్తున్నది. అందులో భాగంగా స్పేస్‌ఎక్స్ యాజమాన్యంలోని స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ (satcom) కంపెనీ మొదటిసారిగా ఇన్-ఫ్లైట్ Wi-Fi ఒప్పందంపై సంతకం చేసింది. JSX, సెమీ-ప్రైవేట్ జెట్ సర్వీస్, స్టార్‌లింక్ నుండి విమానంలో Wi-Fi సర్వీస్ ను కొనుగోలు చేస్తుంది. ఈ ఒప్పందంలో స్టార్‌లింక్ టెర్మినల్స్‌తో కూడిన 100 విమానాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎంత మొత్తంలో భాగస్వామ్యంను కలిగి ఉన్నదో వంటి వివరాలు తెలియదు.

 

శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్

వాణిజ్య విమానయాన సంస్థల్లో ఇంటర్నెట్ అనేది శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల యొక్క అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి. ఇతర కంపెనీలు కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నాయి. విమానంలో Wi-Fi సేవలను అందించడం కోసం స్టార్‌లింక్ తమ ఎయిర్‌క్రాఫ్ట్‌లో టెర్మినల్స్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి అనేక విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతోందని ఎలోన్ మస్క్ 2021లో ట్విట్టర్ ద్వారా తెలిపారు.

UPI ఆన్‌లైన్ పేమెంట్ లతో మోసపోతున్నారా? ఈ తప్పులే కారణాలు అయిఉంటాయిUPI ఆన్‌లైన్ పేమెంట్ లతో మోసపోతున్నారా? ఈ తప్పులే కారణాలు అయిఉంటాయి

 Wi-Fi ఛార్జీ

JSX కస్టమర్లకు విమానంలో Wi-Fi ఛార్జీ విధించబడదని జెట్ సర్వీస్ కంపెనీ JSX ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయడానికి లాగిన్ చేయాల్సిన అవసరం మరియు మరిన్ని వంటి లెగసీ సిస్టమ్‌లు ఉండవని JSX తెలిపింది. షిప్పింగ్ మరియు విమానాలలో స్టార్‌లింక్‌ను ఆపరేట్ చేయడానికి స్పేస్‌ఎక్స్ US ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్ నుండి రెగ్యులేటరీ అనుమతిని కోరింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

స్టార్‌లింక్ డెల్టాతో విమానంలో Wi-Fi సర్వీస్ పరీక్షలు
 

U.S లోని ప్రధాన విమానయాన సంస్థలలో ఒకటైన డెల్టా ఎయిర్ లైన్స్ యొక్క విమానంలో Wi-Fi కనెక్టివిటీ కోసం స్టార్‌లింక్ సేవలను పరీక్షించనున్నట్లు కొన్ని నివేదికలు సూచించాయి. ఎక్కువ మంది ప్రయాణించే వాణిజ్య విమానాలైన ఎయిర్‌బస్ A320 మరియు బోయింగ్ 737 వంటి విమానాలలో Wi-Fi కనెక్టివిటీ కోసం స్టార్‌లింక్ సంస్థ లైసెన్స్ పొందాలని ఆశిస్తున్నట్లు మస్క్ ఇప్పటికే చాలా సందర్భాలలో తెలిపాడు.

ఇంటర్నెట్ కనెక్టివిటీ

విమానంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది శాట్‌కామ్ సర్వీసుల యొక్క ఉత్తమ వినియోగాలలో ఒకటి. అయితే విమానాలలో ఈ టెర్మినల్‌ను ఇన్‌స్టాల్ చేయడం అనేది విమానయాన సంస్థలకు అధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని పరిశ్రమ నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ ప్రక్రియలో ఉన్నప్పుడు టెర్మినల్ ఇన్‌స్టాల్ చేయబడితే కనుక ఇది మరింత పొదుపుగా ఉండడమే కాకుండా ఎయిర్‌లైన్స్ వ్యాపారానికి కూడా అనుకూలమైనదిగా ఉంటుంది. భవిష్యత్తులో విమానం గాలిలో ప్రయాణం చేసేటప్పుడు ఇంటర్నెట్‌ని అందించడానికి శాటిలైట్ టెర్మినల్‌తో రావడం మనం చూడవచ్చు.

Best Mobiles in India

English summary
Starlink Satellite Internet Service New Progress!! Signs First In-Flight Wi-Fi Deal

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X