Home
News

స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసులపై కీలక వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి..!

Starlink Satellite Internet Services in India : భారత్‌ లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల కోసం ఎలాన్‌ మస్క్‌ కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) అనుబంధ సంస్థ స్టార్‌లింక్‌ ఇప్పటికే కీలక అనుమతులు పొందింది. టెలికాం విభాగం ఈ సంవత్సరం జూన్‌లోనే కీలకమైన అనుమతులు జారీచేసింది. అనంతరం జులై నెలలో ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ అథరైజేషన్‌ సెంటర్‌ (IN-SPACe) లైసెన్స్‌ ను కూడా పొందింది. అయితే ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్‌ కేటాయింపులు జరగాల్సి ఉంది.

దీంతోపాటు స్టార్‌లింక్‌ పరంగా బేస్‌ స్టేషన్‌ల ఏర్పాటు సహా మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ ధరకే శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసులు భారత్‌ లో అందుబాటులోకి వ‌చ్చే అవకాశం ఉంది.

starlink

ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి :
ఇటీవల కేంద్ర టెలికాం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ (Pemmasani Chandrasekhar) స్టార్‌లింక్‌ సర్వీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్టార్‌లింక్ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసులకు సంబంధించి 20 లక్షల కనెక్షన్‌ లను మాత్రమే అందించగలదని చెప్పారు. మరియు గరిష్ఠంగా 200 Mbps వేగంతోనే ఇంటర్నెట్‌ సేవలు అందిస్తుందని చెప్పారు.

ఆందోళన అవసరం లేదు :
పరిమిత సంఖ్యలో కనెక్షన్‌ల కారణంగా ప్రస్తుతం భారత్‌ లోని టెలికాం సంస్థలకు ముప్పు కలిగించే అవకాశం ఉండదని చెప్పారు. దీంతోపాటు పోటీ గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే రాజ్యసభ వేదికగా స్టార్‌లింక్ సర్వీసులకు సంబంధించిన కీలక వివరాలను తాజాగా వెల్లడించారు.

తాజాగా డేటా నిల్వపై స్పష్టత :
భారత్‌లో స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్ సర్వీసులకు సంబంధించిన డేటా, ట్రాఫిక్‌ సహా ఇతర వివరాలు పూర్తిగా దేశీయంగానే స్టోర్‌ చేయబడతాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. భారత్‌లోని యూజర్లకు సంబంధించిన పూర్తి డేటా విదేశీ సర్వర్‌ లో నిల్వ చేయరని స్పష్టం చేశారు.

రాజ్యసభలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఇప్పటికే ఈ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల ధర సహా స్పెక్ట్రమ్‌ కేటాయింపులపై నిబంధనలు, షరతులకు సంబంధించిన సిఫార్సులు అందించాల్సిందిగా టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI) ను టెలికాం విభాగం కోరింది.

ఇన్‌స్టాలేషన్‌ ఛార్జీలు :
శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసులకు సంబంధించిన పరికరాల కోసం ముందస్తుగా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల లీక్‌ అయిన వివరాల ఆధారంగా సుమారు రు.33 వేలు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు నెలవారీ కనీసం రూ.3 వేల చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

100 కి పైగా దేశాల్లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు :
స్టార్‌లింక్‌ ప్రస్తుతం వందకు పైగా దేశాల్లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను అందిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకు 7 వేలకు పైగా ఉపగ్రహాలున్నాయి. ఈ ఉపగ్రహాలు భూమికి కేవలం 550 కిలోమీటర్ల ఎత్తులో (LEO) పరిభ్రమిస్తూ సేవలను అందిస్తున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
starlink user data and traffic will be stored in india only said Mos telecom pemmasani in rajyasabha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X